• Prev
  • Next
  • Telugu Jokes

    Telugu Jokes

    " డార్లింగ్ నీ కోసం, నీ ప్రేమ కోసం నన్ను ఏమి చేయమంటే అది చేస్తాను. ఏది తెమ్మంటే

    అది తీసుకువస్తాను. చివరికి చావమన్నా చస్తాను " అని నిజాయితీగా అన్నాడు ఆ

    ప్రేమికుడు.

    " ఎప్పుడు చూడు చస్తానని అన్నావే గాని ఏనాడైనా ఆ ప్రయత్నం చేశావా "? అని

    మూతి మూడు వంకర్లు తిప్పింది ఆ ప్రియురాలు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ ప్రేమికుడు.

    *********

    “ ఒక కిలో చెక్కర ఎంతండి ? ” షాపుకు వెళ్ళిన సంధ్య అడిగింది.

    “ ఆరవై రూపాయలు " చెప్పాడు ఆ షాపతను.

    “ ఒకేసారి పది కిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా "

    “ ఒక పావుకిలో చెక్కర తగ్గుతుంది " నవ్వుతూ చెప్పాడు ఆ షాపతను.

    “ ఆ... ” అంటూ నోరు తెరిచింది సంధ్య.

    ********

    “ఏమండీ...ఆ ఎదురింటాయనను చూశారా! ప్రతిరోజూ ఆఫీసుకెళ్ళేముందు ఎంచక్కా

    వాళ్ళావిడకో ముద్దిచ్చి,టాటా చెప్పి వెళుతుంటాడు.మరి మీరున్నారు ఎందుకూ ?”

    కోపంగా అంది భార్య.

    “ఆడిపోసుకుంటావెందుకే అలా చేయడం నాకూ యిష్టమే.కానీ ఆవిడ ఒప్పుకోవాలిగదా !”

    అయోమయంగా అన్నాడు భర్త.

    ********

    “ మానవ శరీరంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగాలు ఏమిటి ? ”

    అడిగింది సైన్స్ టీచర్.

    “ మగవాడి మొదడు, ఆడదాని నాలుక " అని ఠక్కున చెప్పాడో పిల్లవాడు.

    *****

    “డాక్టర్...నాకు ఆపరేషన్ ఎప్పుడూ చేస్తారు ? ”అడిగాడు పేషెంట్.

    “శవాల గదిలో బెడ్ ఖాళీ అయ్యాక....” అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.

  • Prev
  • Next