• Prev
  • Next
  • Telugu Funny Jokes

    Telugu Funny Jokes

    "రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ

    ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది..."

    చెబుతున్నాడు చింతామణి.

    "అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట" నోరు తెరుస్తూ అన్నాడు భూషణం.

    "మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా"  అసలు విషయం చెప్పాడు చింతామణి.

    **************

    “పేరు కోసం ఎందుకురా ఇంత పాకులాట ?" వెంకటయ్యను అడిగాడు సుబ్బయ్య.

    “డబ్బు సంపాదిస్తే,నా భార్య లాక్కుంటుంది కాబట్టి "గబుక్కున నాలిక్కరుచుకున్నాడు

    వెంకటయ్య.

    “ఆ...”ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు సుబ్బయ్య.

    ************

    చాలా కాలం తరువాత కలిసిన ఇద్దరూ మిత్రులు, ఒకరిని ఒకరు పలకరించుకున్నారు.

    “ ఏరా శేఖర్! బాగున్నావా? చాలా కాలానికి కనిపించావు ?” అని శేఖర్ ను అడిగాడు

    సుధాకర్.

    “ 2000 వరకూ ఏ చీకూ చింత లేకుండా హాయిగా ఉన్నానురా ?” అని సంబరంగా

    చెప్పాడు శేఖర్.

    “ మరి ఆ తరువాత ఏమైంది ?” అని ఉత్సాహంగా అడిగాడు సుధాకర్.

    “ నాకు పెళ్లయింది " అని విచారంగా చెప్పాడు.

    " ఆ..." ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుధాకర్.

    **************

    పిల్లలు తరుచుగా ఎస్.టి.డి. కాల్స్ చేయడం వల్ల టెలిఫోన్ బిల్ పెరిగిందని గమనించిన

    ఆనందరావు, ఇక ముందు పిల్లలెవరూ అరనిమిషం కన్నా ఫోన్ లో మాట్లాడటానికి

    వీల్లేదని చెప్పాడు.

    “ అరనిమిషంలో ఏం మాట్లాడతాం నాన్నా...!” అని చిరగ్గా అన్నాడు పెద్దబ్బాయి.

    “ నేను పెట్టేస్తున్నాను.నువ్వు నా నెంబర్ కి ఫోన్ చెయ్యి...అని చెప్పడానికి అరనిమిషం

    కన్నా ఎక్కువ పట్టదు కదరా ?” అని అన్నాడు ఆనందరావు.

    “ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచారు పిల్లలు. 

  • Prev
  • Next