• Prev
  • Next
  • Telugu Comedy Club

    Telugu Comedy Club

    హాయ్ ఫ్రెండ్స్....వెల్ కమ్ టు తెలుగు కామెడీ క్లబ్.

    కడుపు చెక్కలయ్యేలా నవ్వడం అనేది కేవలం మనిషికున్న అదృష్టం.మరి ఆ అదృష్టాన్ని

    మన సొంతం చేయడానికి మన ముందుకు నవ్వుతూ మనల్నినవ్వించడానికి వచ్చేసింది

    మన తెలుగువన్ కామెడీ క్లబ్. మరి ఆలస్యం ఎందుకు? జోక్స్ తో పాటు కామెడీ సీన్స్

    చూసి సరదాగా నవ్వుకుందాం మరి.

    Brahmanandam Reading - Kajal's Love Letter


    హహహ....ఆర్య కాజల్ కు రాసిన లవ్ లెటర్ బ్రహ్మానందం చదివే కామెడీ సీన్ చూసి

    నవ్వుకున్నారు కదా. ఇప్పుడు ఒక సరదాగా జోక్ చెప్తాను.

    " నీ జీవితంలోకి ఆరుగురు అమ్మాయిలు వస్తారు కాంతారావు '' అని కాంతారావు చేయి

    చూస్తూ చెప్పాడు జ్యోతిష్యుడు.

    దానికి సంబరపడుతూ, కాంతారావు "నిజమా! ఇదిగో వంద! ఎప్పుడు వస్తారు ?, ఎలా

    వస్తారు ? '' అని మరింత మురిపెంగా ముందుకు చేయి చూపిస్తూ అడిగాడు.

    వంద జేబులో పెట్టుకుంటూ "ఎలా ఏమిటి కాంతారావు...ఒక భార్య, ఐదుగురు

    కూతుళ్లూ " అని చెప్పాడు జ్యోతిష్యుడు.

    దానికి ఆ కాంతారావు " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.

    మరి అంతగా నవ్వకండి. కొన్నినవ్వులని దాచుకోండి. ఎందుకంటే మీకోసం మరొక

    కామెడీ సీన్ రెడీగా ఉంది.అది కూడా చూసి అప్పుడు పూర్తిగా నవ్వుకోండి.

    Comedy Scene Between Allu Arjun - MS Narayana - Raghu Babu

    బన్ని సినిమాలోని అల్లు అర్జున్, రఘుబాబు, యం. యస్. నారాయణ ఏ.సి. కామెడీ సీన్ చూసి నవ్వుకున్నారు కదా...have a nice day...


  • Prev
  • Next