• Prev
  • Next
  • Pelliki Mundu - Pelli Taruvata

    పెళ్ళికి ముందు - పెళ్ళి తరువాత

    రాధ కృష్ణల పెళ్ళి నిశ్చితార్ధం అయిపోయింది.

    ఇద్దరికి హైదరాబాదులో software ఉద్యోగం.

    వాళ్ళ కుటుంబాలు (అమ్మా, నాన్నలు మటుకు విజయవాడ లో ఉంటారు).

    ఒక weekend ఇద్దరూ విజయవాడకి వెళ్తున్నారు.

    సమయం : 22:00 hrs

    రాధ : ఏంటి ఇంత త్వరగా station కి వచ్చావు ?

    కృష్ణ : నేను మామూలుగా రైలు 22:30 కి అంటే 22:00 కల్లా station కి వచ్చేస్తాను.

    సరేగాని నేను అలా వెళ్ళి water bottle కొనుక్కొని వస్తాను.

    రాధ : సరే

    ఒక రెండు నిమిషాల తరువాత కృష్ణ పరుగెత్తుకుంటూ రాధ దగ్గరికి వస్తాడు. Water

    bottleతో పాటు brittania little hearts biscuit packet కూడా తీసుకు వచ్చాడు.

    రాధ : ఎందుకు అలా పరుగేత్తుకు రావడం. మెల్లగా రావచ్చు కదా?

    కృష్ణ : అంటే.. నువ్వు ఒక్క దానివే ఉన్నావు కదా. అందుకని.

    రాధ : అయ్యో.. అసలు ఎప్పుడూ నేను ఒక్కదానినే ప్రయాణం చేసేదానిని. ఇదే

    మొదటిసారి ఇంకొకరితో కలిసి వెళ్ళటం.

    కృష్ణ : సరే పద వెళ్ళి రైల్లో కూర్చుందాము.

    రాద, కృష్ణ లు వెళ్లి రైలు ఎక్కి సీట్లల్లో కూర్చుంటారు.

    రాధ : side upper side lower book చేసారా?

    కృష్ణ : అవును. ఇలా అయితే హాయిగా ఎదురు ఎదురుగా కూర్చుని ఎంచక్కా

    కబుర్లు చెప్పుకోవచ్చు.

    అవీ ఇవీ అన్నీ మాట్లాడుకున్నారు. మిగతా ప్రయాణికులు అంతా నిద్రపోయారు కానీ

    వీళ్ళు మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు.

    ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి " మీరు కొంచెం మెల్లగా మాట్లాడుకోండి బాబు.

    మా నిద్రను disturb చేస్తున్నారు" అని అన్నాడు.

    సరే అని రాధ, కృష్ణలు తలుపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గంటెసేపు కూర్చుని,

    మాట్లాడుకుని వచ్చి తమ తమ berth లలో పడుకున్నారు.

    పెళ్ళైన తరువాత

    పెళ్ళైన ఒక సంవత్సరం తరువాత మళ్ళీ రాధ కృష్ణలు విజయవాడకు ప్రయాణమయ్యారు.

    ఇద్దరూ train ఎక్కారు.

    రాధ : ఏ బెర్త్??

    కృష్ణ : రెండు upper berths book చేశాను.

    రాధ : ఎందుకో అలా...

    కృష్ణ : (మనసులో నీ వెధవ నస ఉండదు అని) సరే water bottle ఇవ్వు.

    రాధ : water bottle లేదు. Stationలో కొందామని అనుకున్నాను.

    కృష్ణ : ముందే చెప్పి ఏడవచ్చు కదా? ఇప్పుడు చూడు train బయలుదేరడానికి ఇంకా 5

    నిమిషాలు మాత్రమే ఉన్నది.

    రాధ : మీరు ఇలానే అనుకుంటూ కూర్చుంటే, ఆ 5 నిమిషాలు కూడా ఉండదు.

    కృష్ణ : (ఛీ ఎధవ బతుకు) మనసులో అనుకుంటూ, పరిగెత్తుకుంటూ వెళ్ళి water bottle

    తీసుకొని వచ్చాడు. (ఈ సారి brittania little hearts biscuit packets లేవు ).

    Train time అయ్యింది.బయలు దేరింది.

    రాధ : (ఆవలిస్తూ) : సరే నేను బాగా అలసిపోయి ఉన్నాను. నేను పడుకుంటున్నాను.

    కృష్ణ : సరే పడుకో. అని చెప్పి (కొంచెం సేపు నేను ప్రశాంతంగా ఉండచ్చు)అని మనసులో

    అనుకున్నాడు.

    TC వచ్చి ticket సరి చూసిన తరువాత కృష్ణ కూడా నిద్ర పోవడానికి ఉపక్రమించాడు.

    కానీ ఎంతకీ నిద్ర పట్టడంలేదు.

    పక్కనే side upper ,side lower berth లో మాట్లాడుకుంటున్నా ఒక ప్రేమజంట

    కనబడింది.

    చిన్నగా నవ్వుకుని " ఇంకా పెళ్లి కాలేదు కదా " అని మనసులో అనుకుని నెమ్మదిగా

    నిద్రలోకి జారుకున్నాడు.

  • Prev
  • Next