• Prev
  • Next
  • Padivelu Appicchi

    Padivelu Appucchi

    విచారంగా ఆఫీసుకు వచ్చిన గుర్నాధమును, ఆఫీసు రూము క్లీన్ చేస్తున్న అటెండర్

    చూసి " నమస్తే సార్ " అన్నాడు నవ్వుతూ. " ఆ..ఆ...నమస్తే " అంటూ తన సీటు

    దగ్గరికి వచ్చాడు గుర్నాధం.

    " ఏమయింది సార్ ? చాలా విచారంగా ఉన్నారు " అని అటెండర్ అడిగాడు.

    " ఏమి లేదయ్యా...అందరిని గుడ్డిగా నమ్మడం నా బలహీనతగా మారింది. ఏమి

    చేయాలో అర్థం కావటం లేదు " అని అంటూ ప్యాంటు జేబులో నుండి కర్చుఫ్

    తీసుకుని చెమట తుడుచుకుంటూ ఉండగా " నాకో పదివేలు అప్పిచ్చి నిరూపించుకోండి

    సార్ " అని అన్నాడు అటెండర్.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచి గబుక్కున తన కూర్చిలో కూర్చున్నాడు

    గుర్నాధం.

  • Prev
  • Next