• Prev
  • Next
  • New Year Telugu Jokes

    New Year Telugu Jokes

    Huge Collections of new year telugu jokes, telugu new year sms jokes, telugu new

    year mobile phone jokes and quotes, telugu new year sms collection.

    ప్రతిరోజూ చేసే పనే కదా

    ప్రముఖ టీవీ కంపెనీ వాళ్ళు ఒక క్విజ్ పోటీ నిర్వహించారు. అందులో గెలుపొందిన

    వాళ్ళని విదేశాలకు పంపడానికి నిర్ణయించారు. ఆ పోటీలో మొత్తం నాలుగు జంటలు

    గెలుపొందాయి.

    ఆ నాలుగు జంటల్లో మూడు జంటలు ఆంధ్ర జంటలు. ఒక జంట తమిళ్ జంట.

    ఆ నాలుగు జంటలు విదేశాలకు వెళ్ళాయి.

    ఒక రోజు సాయంత్రం నలుగురు భర్తలు బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

    " ఈ రోజు మన నలుగురం కలిసి ఒక వెరైటీ చేసి మన భార్యలను గొప్ప థ్రిల్ చేద్దాం " అని

    సంబరంగా అన్నాడు తమిళ్ వాడు.

    " మంచి గుమగుమలాడే వంటచేసి మన భార్యలకు తినిపిద్దాం " అని ఆ ముగ్గురిలో

    ఒకడు అన్నాడు.

    " ఓస్...వెరైటీ అంటే ఏమిటో అనుకున్నాను...ఇది నేను రోజూ ఇంటి దగ్గర చేసేదేగా..."

    అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు ఒకడు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోర్లు తెరిచారు ముగ్గురు.

    ************

    అర్థరాత్రి పన్నెండు అవుతోంది. పల్లెటూరు నుండి పట్నం వచ్చిన సుబ్బయ్య అడ్రస్

    దొరక్క ఆ సందూ ఈ సందూ తిరుగుతున్నాడు. ఆకస్మాత్తుగా ఒక కానిస్టేబుల్

    సుబ్బయ్య దగ్గరికి వచ్చి, సుబ్బయ్య నెత్తిమీద ఉన్న మూటను చూసి " ఏయ్.... ఆ

    మూట ఎవరిది ? " అన్నాడు కొంచం కోపంగా.

    " నాదేనండీ " తడబడుతూ చెప్పాడు సుబ్బయ్య.

    " ఊరూ పేరు చెప్పు " అని మళ్ళి గట్టిగా అడిగాడు కానిస్టేబుల్.

    " పేరు నాపేరేనండీ..కాని ఊరూ మాత్రం ఊరోళ్ళ అందరిదండి " అని అన్నాడు సుబ్బయ్య.

    " ఆ ..ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కానిస్టేబుల్.

    *************

    ఇద్దరు పల్లెటూరి రైతులు ఇద్దరు పల్లెటూరి రైతులు ట్రెయిన్లో ప్రయాణం చేస్తున్నారు.

    ట్రెయిన్ ఎక్కేముందు వాళ్ళు ట్రెయిన్లో తినడానికి ఒక డజన్ అరటిపళ్ళు కొనుక్కున్నారు.

    ట్రెయిన్ ముందుకు పరుగెడుతూనే ఉంది.

    ఇద్దరిలో ఒక రైతు ఒక అరటిపండు తీసుకుని తినసాగాడు.

    అంతలో రైలు ఓ టన్నెల్ లోకి ప్రవేశించింది. వెంటనే అరటిపండు తింటున్న మరొక రైతు

    కంగారు పడి పెద్దగా రెండో రైతుతో ఇలా అన్నాడు.

    " ఓరేయ్ నువ్వు ఇప్పుడు అరటిపండు తిన్నావా ? "

    " ఇంకాలేదురా...ఎందుకని ? " అని సందేహంగా ఒక రైతు అడిగాడు.

    " సంతోషం...నువ్వు చాలా అదృష్టవంతుడివి. నేను అరటిపండు తిన్నాను.

    అంతే...గుడ్డివాడిని అయ్యాను, నా కంటికి ఏమి కనిపించడం లేదు " అని బాధగా

    అన్నాడు మొదటి రైతు.

    ఏమి అర్థంకాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.

  • Prev
  • Next