• Prev
  • Next
  • Navvule Navvulu 19

    Navvule Navvulu 19

    Dogilinchina Dress

    “నీ డ్రెస్ చాలా బాగుందే.ఎక్కడ కొన్నావు ?”అడిగింది కవిత.

    “కొనడమా పాడా...దొంగిలించాను"అని గబుక్కున నాలిక్కరుచుకుంది మాధవి.

    *********************

    Kannu kotte Buddulu

    “అమ్మాయికి అన్నీ నీ బుద్ధులే వచ్చాయి!”అన్నాడు మాధవ్.

    “మరేమనుకున్నారు ?అది నాకూతురు "గర్వంగా అంది ఆపర్ణ.

    “అదే చెబుతున్నా...పక్కింట్లోని కుర్రాడికి అదే పనిగా కన్నుకొడుతున్నది!” అని గబుక్కున

    నాలిక్కరుచుకున్నాడు మాధవ్.

    ***************************

    Family Thief

    “నువ్వేంటయ్యా..మాటిమాటికి వాళ్ళింట్లోనే దొంగతనం చేస్తున్నావు ?”అడిగారు జడ్జి.

    “నేను వాళ్ళ ఫ్యామిలీ దొంగని సార్ "అని తెలివిగా చెప్పాడు దొంగ.

    “ఆఁ..”అని నోరు తెరిచాడు జడ్జిగారు.

    *************************

    Finance Company Board

    “ సార్...మీ ఫైనాన్సు కంపెనీ పేరుని, బోర్డుకు రెండు వైపులా వ్రాయమంటారెందుకు "

    అడిగాడు ఆర్ట్ పెయింటర్.

    “ రేపు బోర్డు తిప్పేసామని పేపరు వాళ్ళు వ్రాయకూడదని " అని చెప్పి

    నాలిక్కరుచుకున్నాడు ఆ ఫైనాన్స్ కంపెనీ అతను.

    **************************

    second wife

    “ మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పి చూస్తానన్నావు కదా ! ఇంతకీ ఒప్పుకున్నట్లేనా...? ”

    అడిగింది మాధవి.

    “ ఆఁ...నా మొదటి భార్యను ఒప్పించాను.ఇక రెండో భార్య ఏమంటుందోనని భయంగా ఉంది

    డియర్ " అని చెప్పి నాలుక్కరుచుకున్నాడు వేణు.


  • Prev
  • Next