• Prev
  • Next
  • Marriage gifts

    Marriage gifts

    ***********************

    “ పెళ్లికొడుకు, పెళ్లి కూతురు...ఇద్దరూ మీకు దగ్గరి వాళ్ళే కదా!” అని ఒక పెళ్ళికి

    వచ్చిన తన ఫ్రెండ్ కామేశంను అడిగాడు రామేశం.

    “ అవును. చాలా దగ్గరి వాళ్ళు. ఏం అలా అడిగారు ?” అని ఎందుకు అలా

    అడిగాడో తెలుసుకోవాలనే ఉబలాటంతో అడిగాడు కామేశం.

    “ ఏమిలేదు...మరి వారికి ఏం ప్రెజంట్ చేసావో తెలుసుకుందామని అంతే !” అంటూ

    నవ్వుతూ అన్నాడు రామేశం.

    “ పెళ్ళికొడుక్కి కలర్ టివి.ని, దాని రిమోట్ కంట్రోల్ పెళ్ళికూతురికి ప్రెజంట్ చేశాను

    " అని చెప్పి పకపక నవ్వాడు కామేశం.

    “ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు రామేశం.


  • Prev
  • Next