TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Mallik Telugu Love Jokes
టేస్టు :-
బస్ స్టాపులో మొగుడూ పెళ్లాలు బస్సుకోసం ఎదురుచూస్తూ నిల్చున్నారు. ఇంతలో
బిచ్చగాడు వాళ్ల దగ్గరకు వచ్చాడు.
"అమ్మా...రమ్యకృష్ణలా ఉన్నావ్...ధర్మచెయ్ తల్లీ!"
"హు!...కనీసం బిచ్చగాడికి ఉన్న టేస్టు కూడా లేని భర్తతో కాపురం చేస్తున్నా...."
విసుక్కుంటూ బిచ్చగాడి బొచ్చెలో చిల్లర డబ్బులు వేసింది ఆ భార్యామణి.
అత్తయ్య:-
చాలాకాలం తర్వాత విశ్వం, కిరణ్ కలుసుకున్నారు.
"అన్నట్టు నువ్వు మన కాలేజీ బ్యూటీ అరుణని ప్రిమించావ్ కదా..ఆమెని పెళ్లి
చేస్కుంటానని కూడా అన్నావ్, ఆ విషయం ఏమైంది?" కిరణ్ విశ్వన్ని అడిగాడు.
"నేను అరుణకి నా ప్రేమ విషయం చెప్పానురా...అప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి అని
అడిగింది. మామయ్యకున్న కోట్లకొద్దీ ఆస్తీ నాదే అని చెప్పాను"
"అయితే నిన్ను పెళ్లి చేసేసుకుందా?"
"ఊహు...మా మావయ్యని చేస్కుంది!!..."
శోభనం రోజు....
"రాధా!...ఇకనుండీ మనిద్దరం కష్టసుఖాలు పంచుకుంటూ జీవించాలి!" అన్నాడు.
"అవును గోపీ...నువ్వు చెప్పింది నిజమే!" సిగ్గుపడ్తూ అంది రాధ.
"నీ సుఖం నేను, నా కష్టాలు నువ్వూ పంచుకుని బతుకుదాం!...."
"?...."
రుచిగా వండితే? :-
"రుచికరంగా వండి పెట్టే ఆడడంటే మగాడు పడి చస్తాడు...ఎంతటి మగాడినైనా రకరకాల
వంటకాల్ని రుచిరుచిగా చేసి తినిపించి లోబర్చుకోవచ్చు..." అంది లత లక్ష్మీతో.
"ఓహో!...అందుకేనా మా ఆయన మా వంటమనిషితో లేచిపోయాడు?!" ఆలోచనగా
అంది లక్ష్మి.