• Prev
  • Next
  • Konte Questions-Tuntari Jawabulu-3

    This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

    కొంటె కొశ్శెన్లు - తుంటరి జవాబులు -3

    *******************************************************************

    బి.వి.రావు,చందానగర్.

    కొంటె కొశ్శెన్ :వర్తమాన రాజకీయ నాయకుడి భార్య పండక్కి ఏం కోరుకుంటుంది?

    తుంటరి జవాబు :ఓ బుల్లెట్ ఫ్రూప్ జాకెట్.

    *******************************************************************

    బి.శ్రీరామ్,రుద్రారం.

    కొంటె కొశ్శెన్ :పేషెంట్ ఘోల్లుమనేదేప్పుడు ?

    తుంటరి జవాబు :'రాత్రంతా ఒకటే పొడి దగ్గండీ' అని అంటే 'నేను తడిదగ్గు స్పెషలిస్టునయ్యా'అని డాక్టర్ చెప్పినప్పుడు.

    *******************************************************************

    బి.శ్రీనివాసాచారి,హైదరాబాదు.

    కొంటె కొశ్శెన్ :కవితావేశమంటే ?

    తుంటరి జవాబు :పక్కింట్లో ఉన్న అమ్మాయి పేరు కవిత అయితే కలిగేది.

    *******************************************************************

    జి.రమేష్,రుక్కాపూర్.

    కొంటె కొశ్శెన్ :పాజిటివ్ అవుట్ లుక్ అంటే ?

    తుంటరి జవాబు :కన్నీళ్లు పెట్టుకుంటున్న పెళ్ళాంతో అవి ఆనందభాష్పాలు కదూ అంటూ జోకెయ్యడం.

    *******************************************************************

    వై .శశిరేఖ సాయిబాబా,ఏలూరు.

    కొంటె కొశ్శెన్ : కొత్త చెప్పులు కరవకుండా ఉండాలంటే ?

    తుంటరి జవాబు :కొన్న వెంటనే డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి పళ్ళు పీకించెయ్యాలి.

    *******************************************************************

    ఆదిరాజు &చక్రపాణి,రుద్రారం.

    కొంటె కొశ్శెన్ :విచిత్ర గాయకుడనగా....?

    తుంటరి జవాబు :వేలం పాటకు ఆర్కెస్ట్రా ఉండాలని కోరుకునేవాడు.

    *******************************************************************

    మరిన్నికొంటె కొశ్శెన్లు - తుంటరి జవాబులతో మళ్ళీ కలుద్దాం.

    (హాసం సౌజన్యంతో)

  • Prev
  • Next