• Prev
  • Next
  • Konte Questions-Tuntari Jawabulu-11

    Konte Questions-Tuntari Jawabulu-11

    ********************************

    కొంటె కొశ్శెన్:ఓ జంటకి పెళ్ళయి ఎన్నేళ్ళయిందో ఎలా తెలుసుకోవచ్చు ?

    తుంటరి జవాబు :నడిచేటప్పుడు వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని బట్టి.

    *******************

    కొంటె కొశ్శెన్ : కొత్త చెప్పులు కరవకుండా ఉండాలంటే ?

    తుంటరి జవాబు :కొన్న వెంటనే డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి పళ్ళు పీకించెయ్యాలి.

    **********************

    కొంటె కొశ్శెన్ :ప్రజాప్రతినిధి అంటే ఎవరు ?

    తుంటరి :ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రతి నిధినీ మనవి చేస్తూ తనవిగా చేసుకునేవాడు.

    ***********************

    కొంటె కొశ్శెన్ :ప్రేమ విలువ తెలిసేదేప్పుడు ?

    తుంటరి జవాబు :పర్స్ ఖాళీ అయినప్పుడు.

    ****************************

    కొంటె కొశ్శెన్ :హాస్పటల్ ఆదాయం ఎప్పుడు బాగుంటుంది.మంచి సెంటర్లో

    ఉన్నప్పుడా?మంచి డాక్టర్లున్నప్పుడా ?

    తుంటరి జవాబు :రెండూ కాదు!మంచి నర్సులున్నప్పుడు.

    *************************

    కొంటె కొశ్శెన్ : పెళ్లిపెటాకులు లేకుండా ఎదిగిన కూతురు గుదిబండ అయితే, మరి ఉద్యోగం

    సద్యోగం లేకుండా ఎదిగిన కొడుకు ఏమవుతాడు ?

    తుంటరి జవాబు : అనకొండ


  • Prev
  • Next