• Prev
  • Next
  • Konevadu Paripoyadu

    కొనేవాడు పారిపోయాడు

    అందమైన తెల్లని కుక్కపిల్లని కొందామని వెళ్లాడు లింగంమామ.

    " రండిసార్...మంచి మంచి బుజ్జి బుజ్జి కుక్కపిల్లలున్నాయి మా వద్ద.

    చూపించామంటారా ?" అని అడిగాడు అమ్మేవాడు.

    " మంచి మంచి బుజ్జి బుజ్జి కుక్కపిల్లలు కాదు కాని తెల్లని అందమైన జాతి పౌరుషంగల

    విశ్వాసపాత్రమైన కుక్కపిల్లని చూపించు " అని చెప్పాడు లింగంమామ.

    అమ్మేవాడు తెల్లని కుక్క పిల్లని చూపిస్తూ " చూడండి సార్...మీరు అడిగిన అందమైన

    తెల్లని విశ్వాసంగల కుక్కపిల్ల. దీన్ని యిప్పటికి మూడు సార్లు అమ్మాను " అని

    గబుక్కున నాలిక్కరుచుకున్నాడు.

    అదివిని లింగంమామ దొరక్కుండా పారిపోయాడు.

  • Prev
  • Next