TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
(మూగమనసులు చిత్రంలో "గోదారి గట్టుంది "అనే పాటకు పేరడీగా)
*******************************
గోంగూర పప్పుంది
****************************
పల్లవి : గోంగూర పప్పుంది
పప్పులోన నెయ్యుంది
నెయ్యివేసుకు తింటూవుంటే
తిండి రంజుగా ఉంటుంది...ఓ ఓ ఓ ఓ...హొయ్... !!గోంగూర!!
చరణం : అదురు అదురుగా టేస్తుంది
పెదవులు తడిగా చేస్తుంది
అవకాయను జోడిస్తే
అమృతతుల్యం అవుతుంది... !!గోంగూర!!
చరణం : కందిపాడుంది,పచ్చడి వుంది
సాంబారుందీ, ఫ్రైయ్ వుంది.
కందిపాడుంది,పచ్చడి వుంది
సాంబారుందీ, ఫ్రైయ్ వుంది.
ఏది ముందర కలపాలో
తికమకతో నామది ఉంది !!గోంగూర!!
చరణం : గడ్డపెరుగు నోరూరిస్తూ
గలాసు నిండా ఉన్నాది
గడ్డపెరుగు నోరూరిస్తూ
గలాసు నిండా ఉన్నాది
గుత్తివంకాయ్ ఘుమఘుమలాడుతూ
ఎంతమెక్కితే అంతుంది
గుత్తివంకాయ్ ఘుమఘుమలాడుతూ
ఎంతమెక్కితే అంతుంది !!గొంగుర!!
(హాసం సౌజన్యంతో)