• Prev
  • Next
  • Famous Jokes in Telugu

    Famous Jokes in Telugu

    ఒక గయ్యాళి భార్య "ఫైర్ బ్రాండ్ " అనే నవల చదువుతుంది.

    అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్త, పుస్తకం చదువుతున్న భార్యను

    చూసి  " ఏం చదువుతున్నావే ? " అని అడుగుతాడు.

    " అబ్బా..ఫైర్ బ్రాండ్ నవల చదువుతున్నాను " అని గయ్ నా లేచింది ఆ భార్య.

    " నీవే ఒక ఫైర్ బ్రాండువి...మళ్ళీ వేరే చదవటం ఎందుకు ?" అని

    పరుగున లోపలికి పరుగెత్తాడు ఆ భర్త.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ భార్య.

    ***************

    " ఓరేయ్ సాగర్...నువ్వు ఏం అవ్వాలనుకున్నావు ?" అని తన ఫ్రెండ్ ను

    అడిగాడు కిశోర్.

    " మా నాన్నలాగా డాక్టర్ కావాలనుకుంటున్నారా ! " అని చెప్పాడు సాగర్.

    " ఏమిటి మీ నాన్నగారు డాక్టరా ?" అని కొంచం ఆశ్చర్యంగా అడిగాడు కిశోర్.

    " కాదురా...మా నాన్నగారు కూడా కావాలనుకున్నాడు అంతే..." అని పకపక

    నవ్వుతూ చెప్పాడు సాగర్.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు కిశోర్.

    ********************

    " గుడ్డివాడిని ఓ పదిరూపాయలు దానం చెయ్యండి బాబు " అని ఓ గుడ్డివాడు,

    నాగరాజు దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నాడు.

    " నువ్వు గుడ్డివాడివి ఏంటి ? నీకు ఒక కన్ను బాగానే ఉంది కదా " అని

    అన్నాడు ఆ గుడ్డివాడిని చూసిన నాగరాజు.

    " అయితే ఐదు రూపాయలు ధర్మం చేయండి బాబు " అన్నాడు ఆ గుడ్డివాడు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు నాగరాజు.

    ************************

    కావేరి, అంజలి ఇద్దరూ కలిసి కాలేజీలో సరదాగా మాట్లాడుకుంటున్నారు.

    " అంజలి...నీకు తెలుసా...మా అన్నయ్యని నగరంలో ఉన్న ఒక గొప్ప అందగత్తె

    పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిందంటా " అని చెప్పింది కావేరి.

    " నేనెప్పుడు అలా అనలేదే  " అని గొప్పగా అంది అంజలి.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది కావేరి.


  • Prev
  • Next