• Prev
  • Next
  • Ex - Boyfriend

    మాజీ ప్రియుడు

    బజారులో అనుకోకుండా కలిసిన ఊర్వశి, మేనక చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ

    ముందుకు వెళుతున్నారు.

    ఇంతలో ఒక బిచ్చగాడు వాళ్ళిద్దరికీ ఎదురుగా వచ్చాడు.

    " అమ్మా... కొంచెం దయ చూపించండి..ఎంతోకొంత దానం చేయండి తల్లీ " అని

    అర్ధించాడు ఆ బిచ్చగాడు.

    ఊర్వశి, తన బ్యాగులో నుండి వంద రూపాయల నోటు తీసి ఆ బిచ్చగాడి గిన్నెలో వేసింది.

    వంద రూపాయల నోటును చూసిన బిచ్చగాడు ఆనందంగా కేరింతలు కొడుతూ అక్కడి

    నుండి ముందుకు వెళ్ళిపోయాడు.

    " ఎందుకే ఆ బిచ్చగాడికి వంద వేశావు ? " అని అడిగింది మేనక.

    " పాపం అతను ఇంతకు ముందు అలాంటి నోట్లు నా కోసం చాలా ఖర్చు చేశాడులేవే...."

    అని గబుక్కున నాలిక్కరుచుకుంది ఊర్వశి.

    " అంటే అతను..."

    " నా మాజీ ప్రియుడు " అని సిగ్గుపడుతూ చెప్పింది ఊర్వశి.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది మేనక.

  • Prev
  • Next