• Prev
  • Next
  • Delhi Special Tablets

    Delhi Special Tablets

    డిల్లీ నుండి తెచ్చిన స్పెషల్ టాబ్లెట్లు

    " ఓరేయ్ ఉదయ్...మా నాన్నగారు డిల్లీ నుండి స్పెషల్ టాబ్లెట్లు తెప్పించారు. అవి నోట్లో

    వేసుకుంటే చాలు...ఎలాంటి వాళ్లైన నిజం చెప్పెస్తారు " అని అని గొప్పగా చెప్పాడు కిరణ్.

    " అలాగైతే ఆ స్పెషల్ టాబ్లెట్లు నాకు రెండు ఇవ్వురా..." అని ఉత్సాహంగా అడిగాడు

    ఉదయ్.

    " ఇదిగో తీసుకో " అని రెండు టాబ్లెట్లు ఇచ్చాడు కిరణ్.

    వాటిని నోట్లో వేసుకున్న ఉదయ్ " ఛా...ఇవి టాబ్లెట్లు కాదురా..పిప్పరమెంట్లు " అని నిజం

    చెప్పాడు.

    " చూశావా..చూశావా...అవి నోట్లో వేసుకున్నావో లేదో అప్పుడే నిజం చెప్పేశావు " అని

    పకపక నవ్వాడు కిరణ్.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు ఉదయ్.

  • Prev
  • Next