• Prev
  • Next
  • Comedy Parody song

     

    This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

    ******

    Comedy Parody Song

    ****************

    (ఉండమ్మా బొట్టు పెడతా అనే చిత్రంలోని " రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా" అనే

    పాటకు పేరడీగా )

    రచన- రాయచోటి కృష్ణమూర్తి

    *******************************

    రావమ్మా! మహాతల్లి రావమ్మా!!

    ***************

    రావమ్మా! మహాతల్లి రావమ్మా!!

    ఈ పార్లర్లో నీవు కొలువై ఉందువుగాని

    కొలువైఉందువుగానీ - కులుకులా రాణి

    !!రావమ్మా! మహాతల్లి రావమ్మా!!

     

    జడక్రింద, మెడపైన మసాజు చేసి

    కన్నుల్ల చారికలు మాయమ్ము చేసి

    తెల్లంగ మారిన కురుల సంపదను

    నల్లంగ మార్చేము వేగా రావమ్మా...

    !!రావమ్మా! మహాతల్లి రావమ్మా!!

     

    చిటికెడు బ్లీచు ముఖాన పూసి బ్లీచింగో బ్లీచింగు...

    మూరెడు దారం కనుబోమ్మలకు త్రేడ్డింగో త్రేడ్డింగు...

    బాదాము పాలతో-క్లీన్సింగో క్లీన్సింగు...

    సన్ సిల్కు షాంపుల్తో-వాషింగో వాషింగు

    పాలిచ్చే తల్లులకు-బొమ్మలు ఉచితం

    పనిచేసే మహిళలకు-పర్సులు ఉచితం

    ఉచితం ఓ అందం-అది ఆరని గంధం

    శుష్కించే పడతలకు కలకాలం బంధం

    కలకాలం బంధం...

    !!రావమ్మా! మహాతల్లి రావమ్మా!!

    (హాసం సౌజన్యంతో)

  • Prev
  • Next