• Prev
  • Next
  • Comedy Kavithalu in Telugu

    Comedy Kavithalu in Telugu

     

    వాడో మెదడు తినే శాడిస్టు

    తగులుకుంటే వదలని పేస్ట్

    వాడికి లేదు టెస్ట్

    వాడి బ్రతుకే వేస్ట్

    దొరికితే అయిపోతాం రోస్ట్

    వాడికన్నా నయం

    రామ్ గోపాల్ వర్మ ఘోస్ట్

    ***************

    రాహుల్ ద్రావిడ్ ఆడతాడు డిఫెన్స్

    నా కవితల్లో వుంది మంచి సెన్స్

    బండి నడపాలంటే కావాలి లైసెన్సు

    నాతో వుండి పెంచుకోండి కాన్పిడేన్స్

    నువ్వు ఒక నాన్సెన్స్

    నీకు తక్కువ కామన్ సెన్స్

    ********************

    మా పేటలో చేశారు ఇద్దరు దోస్తీ

    ఊరంతా చేశారు మస్తీ మస్తీ

    వాళ్ళన్న తిరిగాడు గస్తీ

    వన్ ఫైన్ డే ఇద్దరు పడ్డారు కుస్తీ

    మీ ప్రాస విని మేమయ్యాము సుస్తీ

    మీరు వదిలేస్తే మేం వెళతాము బస్తీ

    *********************

    మా వాడు బహు సమర్థుడు

    ఎవరికీ తిండి పెట్టడు కానీ

    ఎవరికైనా సరే

    ఎసరు మాత్రం పెట్టగలడు

     

  • Prev
  • Next