• Prev
  • Next
  • Chettukinda Jyotishyudu

    Chettukinda Jyotishyudu

    చెట్టుకింది జ్యోతిష్యుడు

    తల పండిన జ్యోతిష్యుడు ఒక చెట్టు కింద ఇలా బోర్డు పెట్టుకుని కూర్చున్నాడు.

    " ఇక్కడ మీకు కలిగే సందేహలన్నింటికి జోష్యం చెప్పబడును. ఫీజు రు. 20/- ! ప్రతి

    ఒక్కరు రెండు ప్రశ్నలు మాత్రమే అడగాలి..." అని ! గురునాధం అక్కడికి వచ్చి ఆ

    జోతిష్యుడి చేతికి ఇరవై రూపాయలు ఇచ్చాడు. " ఇరవై రూపాయలకు రెండు ప్రశ్నలంటే

    చాలా అన్యాయం. నేను మూడు ప్రశ్నలు అడగొచ్చా....? " అని అన్నాడు.

    " అడగకూడదు...ఆ...ఇప్పుడు మీ రెండో ప్రశ్న అడగండి..." అని అన్నాడు జోతిష్యుడు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గురునాధం.

  • Prev
  • Next