• Prev
  • Next
  • Chenchu Lakshmi Parody Song

    Chenchu Lakshmi Parody Song

    ( " చెంచులక్ష్మి " చిత్రంలోని " చెట్టులెక్కగలవా " అనే పాటకు పేరడీగా ఈ

    బట్టలుతగలవా ఓ గడసరి అని )

     

    ఆమె : బట్టలుతక గలవా ఓ గడసరి పట్లు దులపగలవా

    బట్టలుతికి ఆ కొళాయి దగ్గర అంట్లు తోమగలవా

    ఓ గడసరి అంట్లు తోమగలవా .....

     

    అతడు : బట్టలుతకగలనే ఓ కంచుకి పట్లు దులపగలనే

    ఓ కంచుకి అంట్లు తోమగలానే!

     

    ఆమె : గరిక పీకగలవా ఓ గడసరి పరుపులేత్తగలవా

    పేడ పట్టుకుని గోడలపై నువ్వు పిడకలేట్టగలవా

    ఓ గడసరి పిడకలేట్టగలవా....

     

    అతడు : గరిక పీకగలనే ఓ కంచుకి పరువులేత్తగలనే

    పీడ పిసికి ఎదురింటి గోడపై పిడకలేట్టగలనే

    ఓ కంచుకి పిడకలేట్టగలనే !

     

    ఆమె : ఓ....హొయ్...మురుగు కాలువను

    ముక్కు మూయకా కడిగి చూపగలవా

    ఓ గడసరి కడిగి చూపగలవా.....

     

    అతడు : మురుగు కాలువను పరమ నాణ్యముగా కడిగి

    చూపగలనే ఓ కంచుకి కడిగి చూపగలనే

    ఓ కంచుకి కంపు నోపగలనే....

     

    ఆమె : !! బట్టలుతకగలవా !!

     

    అతడు : ఓ హొయ్....ప్రశ్ననేల నను కుక్కలాగా

    నీ వెంట తిప్పుకొవా..ఓ కంచుకి నీ వెంట తిప్పుకొవా...

     

    ఆమె : మనసు తెల్సుకుని కాళ్ళు పిసికితే మనువడానిస్తా

    ఓ గడసరి మనువడానిస్తా

    ఓ గడసరి కుక్క బతుకునిస్తా....

     

    అతడు : !! బట్టలుతకగలనే  !!


  • Prev
  • Next