• Prev
  • Next
  • America Manavadu

    అమెరికా మనవడు

    అమెరికా నుండి వచ్చిన పదేళ్ళ మనవడిని తీసుకుని గుడికి వెళ్లాడు నారాయణ.

    ఇద్దరు దేవుడికి దండం పెట్టుకున్నారు.

    షర్ట్ జేబులో నుండి రూపాయి తీసి మనవాడికి ఇస్తూ " ఇదిగో మనవడా...ఈ రూపాయి

    హుండీలో వేయి " అంటూ మనవడి చేతికి రూపాయి బిళ్ళని ఇచ్చాడు నారాయణ.

    ఆ మనవడు రూపాయిని తీసుకుని ఒకసారి హుండీ వైపు అనుమానంగా చూసి

    " వేస్తాను కాని తాతయ్య..అందులోంచి ఏం వస్తుంది ? చాక్లేటా లేక ఐస్ క్రీమా ?" అని

    అమాయకంగా అడిగాడు.

    ఏమి చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు ఆ తాతయ్య.

  • Prev
  • Next