• Prev
  • Next
  • ఔను వాళ్లిద్దరివి కట్టుడు పళ్ళు

    ఔను వాళ్లిద్దరివి కట్టుడు పళ్ళు

    ఒక రోజు సాయంత్రం సరదాగా...విద్య, చంద్రకళ ఇద్దరూ కలిసి విద్య వాళ్ళ బామ్మగారింటికి

    వెళ్లారు. పరిచయాలు అయ్యాయి. భోజనాలకి రమ్మని పిలిచారు. ముందుగా మీరు

    చేయండి అని విద్య, చంద్రకళ చెప్పారు.

    అప్పుడు తాతయ్య బామ్మ డిన్నర్ టేబుల్ మీద కూర్చుని ఉన్నారు. ఎదురుగా వండిన

    ఆహరం ఉంది. తాతయ్య తింటున్నాడు. బామ్మ చూస్తూ కూర్చొని వుంది.

    " బామ్మ ! నీకు ఆకలిగా లేదా ? భోజనం చేయడం లేదేమిటి ? " అని బామ్మని అడిగింది

    చంద్రకళ.

    " వేస్తోందమ్మా! కాని యిప్పుడు పళ్ళు మీ తాతయ్య ఉపయోగించుకుంటున్నారుగా "

    అని ముసిముసిగా నవ్వుతూ చెప్పింది బామ్మ.

    " అంటే..." కొంచం అర్థమై కొంచం అర్థం కానట్టుగా అడిగింది చంద్రకళ.

    " ఔను...వాళ్లిద్దరివి కట్టుడు పళ్ళు " అని చెప్పి పకపక నవ్వింది విద్య.

  • Prev
  • Next