Home » Jokes » Vastaavaa Muddistaa
వస్తావా ముద్దిస్తా
నవలలు అద్దెకిచ్చే ఒక షాపు దగ్గరికి రుక్మిణి అనే ఒక పెద్దావిడ వచ్చింది.
ఆవిడని చూడగానే, ఆ షాపు అతను పలకరింపుగా నవ్వి " చెప్పండి మేడం...ఏం
కావాలి ? " అని అడిగాడు.
" కొత్త నవలలు ఏమైనా వచ్చాయా ? " అని అడిగింది రుక్మిణి.
" వచ్చాయి మేడం " అని చెప్పాడు ఆ షాపు అతను.
" ఏదైనా ఒక మంచి నవల పేరు చెప్పండి ?" అని రుక్మిణి అడిగింది.
" వస్తావా ముద్దిస్తా " అని గబుక్కున చెప్పాడు ఆ షాపు అతను.
అంతే...లాగి పెట్టి గట్టిగా ఒకటి కొట్టింది రుక్మిణి.
దెబ్బ తగిలిన చెంపని చేతితో పట్టుకుని " ఎందుకు కొట్టారు మేడం ?" అని బాధగా
అడిగాడు ఆ షాపువాడు.
" నన్ను వస్తావా ముద్దిస్తా అని అంటావా ?" కోపంగా చూస్తూ అంది రుక్మిణి.
" అయ్యో మేడం...అది నవల పేరు " అని ఆ పేరుతో ఉన్న నవల తీసి చూపించాడు
ఆ షాపువాడు.
ఆ నవలను చూసిన రుక్మిణి " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది.