Home » Comedy Stories » Telugu Navala

తెలుగు నవల

మల్లిక్

" ఛీరేస్తాన్ "

రచయిత నెత్తురు కసాయిరావ్.

( ఆంధ్రుల అభిమాన, ఆరాధ్య రచయిత నెత్తురు కసాయిరావ్ నవల ఈ వారం నుండే ప్రారంభిస్తున్నాం. పాఠకులూ...ఈ కరడు కత్తిన కసాయి సీరియల్, ఎక్సయిటింగ్ సీరియల్, సేక్సయిటింగ్ సీరియల్, హింసాత్మక పాషాణ సీరియల్ కోసం కళ్ళని పత్తికాయలు చేసుకుని ఇన్నాళ్ళుగా పిచ్చిగా ఎదురు చూశారుగా..ఇక చదవండి. చదివి నెత్తిబాదుకు ఏడవండి...మీ ఎడిటర్ )

మందాకినీ పరుగు తీస్తుంది. ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది. ఆమె పాదాలు చిట్లి స్రవిస్తున్నాయి. అలా పరుగు తీయటంలో ఆమె చీర ఎక్కడో పడిపోయింది. ప్రస్తుతం లంగా, జాకెట్ తో పరుగుతీస్తుంది.

( ఆమె లంగా జాకెట్ తో పరుగు తీయటం మనసులో ఊహించుకుని పాఠకులు లొట్టలు వేస్తారు నాకు తెలుసు...రచయిత ) ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళూ నలుగురూ రానురాను దగ్గరికి వచ్చేస్తున్నారు. హఠాత్తుగా ఒక రాయిని పట్టుకుని మందాకినీ కిందపడి పోయి కాస్త దూరం దొర్లింది.

ఆమె శరీరం మొత్తం గీసుకుపోయి నెత్తురు స్రవించసాగింది. మూలుగుతూ లేవబోయిన మందాకిని చుట్టూ చూసింది. ఆ నలుగురూ దుర్మార్గులు మందాకిని చుట్టూ మూగిపోయి ఉన్నారు. వాళ్ళు కోర్కెలతో బుసలు కొడుతూ ఆమె మీదకి వంగారు. అప్పుడు భయంతో ఆమె పెట్టిన కేక ఆ ప్రదేశమంతా మారుమ్రోగింది.

'' థన్ '' మని పెద్ద శబ్దం అయ్యింది.భయంతో కళ్ళు మూసుకుని ఉన్నా మందాకిని ఆ శబ్దమ విని కళ్ళు తెరిచింది. ఆ నలుగురిలో ఒక రౌడి దూరంగా నేలమీద పడి ఉన్నాడు. అతని నోటి నుండి రక్తం కారుతూ ఉంది. వాళ్లకి ఎదురుగా ప్రళయకాల రుద్రుడిలా ప్రభంజన్ ఉన్నాడు.

" ఒక ఆడపిల్లని నిస్సహాయురాల్ని, ఒంటరిదాన్ని చేసి ఆమె శీలాన్ని దోచుకోవాలని అనుకుంటార్రా..మిమ్ముల్ని ఏం చేస్తానో చూడండి " అని రౌద్రంగా చూస్తూ అరిచాడు ప్రభంజన్.

సరిగ్గా అదే సమయంలో వాళ్ళ నలుగురిలో ఒకడు బుర్ర గోక్కుకున్నాడు. వాడలా బుర్రగోక్కుంటే చూసి ఉలికిపడ్డాడు ప్రభంజన్. అతని కళ్ళ ముందు గతం అంతా సినిమా రీలులా తిరిగింది.

" అమ్మా " అంటూ ఆర్తనాదం చేశాడు ప్రభంజన్.

" ఏంట్రా నాయనా గుండెలు అదిరిపోయేలా ఇట్టా అరిచాడు " అనుకున్నారు ఆ నలుగురు.

గతాన్ని అంతా ఓ సారి తలుచుకున్నాక రెండో వ్యక్తీ వంక చూశాడు ప్రభంజన్.

ఆ రెండో వ్యక్తి ముక్కులో వేలు పెట్టి గిరగిరా తిప్పాడు.

ప్రభంజన్ మాలీ ఉలిక్కిపడ్డాడు.వీడు కూడా వాడే. తన చిన్నతనంలో..

తనకి ఆరేళ్ళ వయసున్నప్పుడు...." అమ్మా " అని మరోసారి ఆర్తనాదం చేసి మూడో వ్యక్తి వంకా, నాలుగో వ్యక్తి వంకా చూశాడు.

మూడో వ్యక్తి జేబులోంచి పుల్లతీసి పళ్ళు కుట్టుకున్నాడు. నాలుగో వ్యక్తి చెవిలో చిటికెన వేలు పెట్టి తిప్పసాగాడు. ప్రభంజన్ ఉలిక్కపడి " అమ్మా.....అమ్మా...." అని రెండుసార్లు ఆర్తనాదం చేశాడు.

" వీళ్ళు నలుగురు వాళ్ళే " అనుకున్నాడు.

అతని కళ్ళు అగ్ని గోళాలయ్యాయి.

" ఒరేయ్..ఇరవై ఏళ్ళ క్రితం గుర్తిందిరా..? మీరు ఎంత అన్యాయం చేశారో " అని గట్టిగా అరిచాడు.

" ఇరవై ఏళ్ళ క్రితమా...ఏం చేశాం ?" అన్నాడు ఆ నలుగురిలో ఒకడు.

" మా అమ్మని మీరు నలుగురు కలిసి రేప్ చేశారు..అయితే మీరు ఇంకా ఈ రేపులు చేసే బిజినెస్ మాన్లేదన్నామాట " అని పళ్ళు నూర్తూ అన్నాడు ప్రభంజన్.

" మీ అమ్మానా...ఎవరు మీ అమ్మ?"

" జానకి " అని జవాబు చెప్పాడు ప్రభంజన్.

అంతే..నలుగురూ ఒక్కసారిగా ప్రభంజన్ మీదపడి అతన్ని కిందపడేశారు. ఒకడు ప్రభంజన్ వీపుమీద కూర్చున్నాడు. మరొకడు అతని చేతులు నొక్కి పడితే, ఇంకొకడు కాళ్ళు నొక్కి పట్టాడు. నాలుగోవాడు ప్రభంజన్ పంట్లాన్ని పట్టి కాస్త కిందికి లాగి చూశాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. అంతలోనే భయంకరంగా గావుకేక పెట్టాడు.

" ఉందా ?" ఆతృతగా అడిగారు మిగితా ముగ్గురూ.

" ఉంది..వీది పిర్రమీద కుంకుడు గింజంతా పుట్టుమచ్చ ఉంది " చెప్పాడు నాలుగో వ్యక్తి.

" ఎడమ పిర్రా కుడి పిర్రా ?"

" కుడిపిర్రే " చెప్పాడు నాలుగోవాడు. అదివిన్న మిగతా ముగ్గురు కూడా గావుకేక పెట్టారు.

" అయితే వీడు నిస్సందేహంగా జానకి కొడుకే. మనమీద ప్రతీకారం తీర్చుకుంటాడు " ఇలా అనుకుని ప్రభంజనని వదిలిపెట్టి ఆ నలుగురూ పరుగుతీశారు. ప్రభంజన్ మందాకిని చేయి పట్టుకుని " మీరు కూడా రండి " అని ఆమెతో పాటు వాళ్ళ వెంట పడ్డాడు.

కొంతదూరం వెళ్ళాక ఆ నలుగురు ఒక జీప్ ఎక్కారు. ఆ జీప్ రివ్విన ముందుకు కదిలింది. అక్కడే ఒక మోటార్ సైకిల్ ఉంటే దానిమీద ప్రభంజన్ మందాకినీ కూర్చుని వారిని వెంబడించారు. ఒక రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర జీపు ముందుగా వెళ్ళిపోయినా తరువాత గేటు పడింది. ప్రభంజన్ పిడికిలి బిగించి మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ మీద కసిగా గుద్దేడు.

మందాకిని కళ్ళ ముందు ధారాపాతంగా అశ్రువులు కారుతున్నాయి. ఆమె అప్పుడే తన హృదయ విదారక గాధని ప్రభంజన్ చెప్పుతుండగా తెలుసుకుంటూ ఉంది. ప్రభంజన్ తన కళ్ళ నుండి రక్తాశ్రువులు స్రవిస్తూ ఉండగా చెప్పసాగాడు.

" అలా మా అమ్మ జానకిని ఆ నలుగురూ కలిసి రేప్ చేసిన తరువాత ఆమెను చంపేసి ఆ హత్యానేరాన్ని మా బ\నాన్న మీదకు తోసేశారు ఆ దుర్మార్గులు. చట్టానికి చెవులే గానీ కళ్ళుండవు కదా! అందుచేత మా నాన్నకి ఉరిశిక్ష పడింది. " అతని కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు కారుతున్నాయి. మందాకినీ చీర చెంగుతో అతని కన్నీళ్లు తుడవాలని అనుకుడి గానీ తీరా చూసుకుంటే ఆమె ఒంటి మీద చీరలేదు. ఆమె లంగా, జాకెట్టుతోనే ఉంది. అతని కన్నీళ్లు కూడా తుడిచేందుకు వీలులేని ఆమె దుస్థితికి దుఃఖం వచ్చింది.

ప్రభంజన్ తలని రెండు చేతుల్తో లాక్కుని తన గుండెలకి అదుముకుంది. తన మొహాన్ని ఆమె గుండెలకేసి రాసి కన్నీళ్లు చెరిపెస్తున్నాడు ప్రభంజన్. కానీ అలా చెయ్యటం వల్ల అతనిలో ఉద్రేకం చేలరేగింది. ఆమెని అమాంతం ఎత్తి గడ్డిలో వెల్లికిలా పడేశాడు. అలా పడటంలో మందాకిని లంగా పైదాకా చెదిరిపోయింది. ఆమె వంక కాంక్షతో చూసిన ప్రభంజన్ ఆమె మీదపడి.....ఛీ ఛీ...ఇక్కడ నేనిహ రాయలేని బాబూ...మల్లిక్.

" ఊ " తృప్తిగా మూలిగింది మందాకిని.

మందాకినిని ఓ పట్టు పట్టిన హుషారులో విజిలేసుకుంటూ అప్పుడే ఇంటికి వచ్చిన ప్రభంజన్ పాప మూలుగు విని ఠకీమనీ హాలు మధ్యలో ఆగిపోయాడు. ఓ పక్కగా వదిన అన్నపూర్ణ నిలబడి చెంగుతో కళ్ళ వత్తుకుంటూ ఉంది.

" పాపెందుకు మూలుగుతుంది వదినా ? నువ్వెందుకు ఏడుస్తున్నావు " అని వదినని అడిగాడు ప్రభంజన్.

అప్పుడు అన్నపూర్ణ చెప్పింది విని పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు ప్రభంజన్.

అర్ధరాత్రి పన్నెండు గంటలైంది. అది శ్మశానం. ఆ శ్మశానంలో ఒంటరిగా నడుస్తున్నాడు ప్రభంజన్ జంకులేకుండా. అతని కాళ్ళకింద పడి పుర్రెలు ఫటఫట చిట్లుతున్నాయి. నక్కలు పాతిపెట్టిన శవాలను వెలికిలాగి పీక్కు తింటున్నాయ్. శ్మశానం మద్యలో ముగ్గువేసుకుని దానిమీద కూర్చుని మాంత్రికుడు మహమ్మద్ పీరా మంత్రాలు చదువుతున్నాడు.

అతన్ని చూస్తూన్నే ప్రభంజన్ కళ్ళు అగ్ని గోళాలయ్యాయి. పరుగున వెళ్లి పీరా గొంతు పట్టి పైకిలేపి గడ్డం కింద ఒక్కటిచ్చాడు. అప్పుడు ఆ మాంత్రికుడు పీరా పెట్టిన కేకకి ఆ శ్మశానంలో శవాలు సైతం గడగడలాడాయి.

" రాత్రి నేను ఆ మాంత్రికుడిని చితక్కోట్టాను వదినా..కానీ వాడు మన పాపకి చేతబడి చేయలేదు " చెప్పాడు ప్రభంజన్.

" మరి మనపాప ఎందుకు చిక్కిపోతుంది ?" అని అడిగింది అన్నపూర్ణ. ప్రభంజన్ పాపని డాక్టర్ చూపించాడు.

డాక్టర్ చెప్పింది విని అదిరిపడ్డాడు ప్రభంజన్.

" మీ పాపని ఎవరో నలుగురు రేప్ చేసినట్టున్నారు. అందుకే పాపకి మానసికంగా దెబ్బ తగిలి అలా చిక్కిపోతుంది " అని. ప్రభంజన్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

" ఆనాడు మా అమ్మని రేప్ చేశారు.ఈనాడు పసిది అని కూడా చూడకుండా పాపని రేప్ చేశారు. ఇది తప్పకుండా వాళ్లపనే. వాళ్ళ అంతు చూడందే నిద్రపోను " అని అనుకున్నాడు.

మందాకిని సహాయంతో ఆ నలుగురు ఎవరో తెలుసుకున్న ప్రభంజన్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళ నలుగురిలో ఒకడు పోలీసు కమీషనర్, ఒకడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఒకడు స్మగ్లర్, ఒకడేమో ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్టు. తన తల్లిని రేప్ చేసినప్పుడు ఆ పోలీసు కమీషనర్ కానిస్టేబుల్ గా పనిచేసేవాడు.

ఆ ఇండస్ట్రియలిస్టుకి ఒక కిళ్ళీ కొట్టు ఉండేది. స్మగ్లర్ కాఫీ హోటల్లో క్లీనరుగా ఉండేవాడు. ఆ ఆర్టిస్ట్ రోడ్డుమీద చాక్ పిస్ తో ఆంజనేయస్వామి బొమ్మలు గీసేవాడు.

ఆ నలుగురి గురించి ఇన్పర్మేషన్ తెలుసుకున్నాక హోటల్ గదిలో మందాకినిని మంచం మీద ఎత్తి పడేసిన ప్రభంజన్...

(సారీ...ఇక్కడ కూడా నెత్తురు కసాయ్ రావ్ నవలలో ఏం రాశాడో నేను చెప్పలేను..)

అప్పటికి అలా గంటనుండి ఆ కారుని చేజ్ చేస్తున్నాడు ప్రభంజన్. చివరకు మోటార్ సైకిల్ తో కారును ఓవర్ టేక్ చేసి కారుకి అడ్డంగా నిలబెట్టాడు. అందులోని స్మగ్లర్లని పట్టి కిందికి లాగి తానై మర్మావయాన్ని కత్తితో కోసేశాడు.

( కథ ఇలానే 30 వారాలు సాగుతుంది. విలన్లందరూ చచ్చాక మందాకిని, ప్రభంజన్ ల వివాహంతో సుఖాంతం అవుతుంది ......రచయిత )


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.