Home » Comedy Stories » Manchi Manasulu Movie Parody Song
Manchi Manasulu Movie Parody Song
"మంచి మనసులు" సినిమాలోని (శిలలపై శిల్పాలు చెక్కినారు) అనే పాటకు పేరడి.
అహో సాంద్ర భోజా
వీర తిండిపోతు రాయా
ఉడిపి హోటలు వైభవ నిర్మాణ తేజో విరాజా
ఈ కలశాలలో చిరంజీవివైనావయా
ఇడ్లిపై సాంబారు పోసినాడు
మనవాడు ప్లేటుకే అందాలు తెచ్చినాడు
ఇడ్లిపై సాంబారు పోసినాడు.
జీర్ణమ్ము కరువైన వారికైనా
జీర్ణమ్ము కరువైన వారికైనా
అరిగించి కరిగించి అలరించు రీతిగా
ఇడ్లిపై సాంబారు పోసినాడు.
ఒకవైపు ఉర్రూతలూపు వాసనలు
ఒకపక్క ఉరికించు కేకలూ అరుపులూ
ఒకవంక కనువిందు చేయు సర్వర్లు
షడ్రుచులు ఒలికించు హోటలుకే వచ్చాము
ధనము లేదని నీవు కలత పడవలదు
ధనము లేదని నీవు కలత పడవలదు.
నా పర్సు నీదిగా చేసుకుని మింగు
ఇడ్లిపై సాంబారు పోసినాడు.
సింగిలిడ్లి పైన సాంబారు పోస్తుంటే
నీరుల్లి ముక్కలు తెలియాడంగా...
సింగిలిడ్లి పైన సాంబారు పోస్తుంటే
నీరుల్లి ముక్కలు తెలియాడంగా...
దంతస్తంభాలకే కదలికల్ కలిగించి
కరకరా పరపరా శబ్దాలు చేయగా
లుంగిముడి వేసుకుని కొత్త ఖాతాలు
లుంగిముడి వేసుకుని కొత్త ఖాతాలు
అర్దరివ్వాలని అరగించాలని ఇడ్లిపై
సాంబారు పోసినాడు.
మనవాడు ప్లేటుకే అందాలు తెచ్చినాడు.
దిబ్బట్లు పోయినా పిజ్జాలు వచ్చినా
కాలమే మారినా రుచి చచ్చిపోయినా
మనుజులై దనుజులై మట్టిచవి చూచినా
ఆ...ఆ...ఆ... చెదరనీ కదలనీ
శిల్పమ్మువోలె నీవు నా హృదయ మందు
నిత్యమై సత్యమై నిలిచివుందువు ఇడ్లీళా !! నిజము నా జూబిలీ !!