పల్లెటూరి రైతులు రైలు ప్రయాణం

 

పల్లెటూరి రైతులు రైలు ప్రయాణం

 

 

ఇద్దరు పల్లెటూరి రైతులు ట్రెయిన్లో ప్రయాణం చేస్తున్నారు.

ట్రెయిన్ ఎక్కేముందు వాళ్ళు ట్రెయిన్లో తినడానికి ఒక డజన్ అరటిపళ్ళు కొనుక్కున్నారు.

ట్రెయిన్ ముందుకు పరుగెడుతూనే ఉంది.

ఇద్దరిలో ఒక రైతు ఒక అరటిపండు తీసుకుని తినసాగాడు.

అంతలో రైలు ఓ టన్నెల్ లోకి ప్రవేశించింది. వెంటనే అరటిపండు తింటున్న రైతు

కంగారు పడి పెద్దగా రెండో రైతుతో ఇలా అన్నాడు.

" ఓరేయ్ నువ్వు ఇప్పుడు అరటిపండు తిన్నావా ? "

" ఇంకాలేదురా...ఎందుకని ? " అని సందేహంగా రెండో రైతు అడిగాడు.

" సంతోషం...నువ్వు చాలా అదృష్టవంతుడివి. నేను అరటిపండు తిన్నాను.

అంతే...గుడ్డివాడిని అయ్యాను, నా కంటికి ఏమి కనిపించడం లేదు " అని బాధగా

అన్నాడు మొదటి రైతు.

ఏమి అర్థంకాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు రెండో రైతు