TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఖుషిఖుషీగా ప్రేమికుల గిలిగింతలు
అమ్మాయిలకైన అబ్బాయిలకైనా ప్రేమించడం, ప్రేమించబడటం ఈ రెండు గొప్పే! కాకపొతే
వీళ్ళు ఆ ప్రేమలో ఎంతవరకు సఫలీకృతం అవుతారన్నది వాళ్ళకే కాదు చూస్తున్నవాళ్ళకి
కూడా అర్థం కాదు. ప్రేమ బాధితులల్లో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు.
సరదాగా అమ్మాయిల మీద అబ్బాయిలు, అబ్బాయిల మీద అమ్మాయిలు చేసుకునే
కామెంట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం !
* " చూసే పత్రి అమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, ప్రేమించే
ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు, విశ్వదాభిరామ అమ్మాయిల్ని నమ్మకురా
మామ " ఒక ప్రేమ బాధితుడు.
* " డబ్బులేని అబ్బాయిలను చూడకు, డబ్బులేని అబ్బాయిలతో మాట్లాడకు,
వాళ్ళు ఏమి చెప్పినా వినకు ! డబ్బున్న అబ్బాయిని పట్టుకో దర్జాగా లైఫ్ ని
ఎంజాయ్ చేసుకో " ఒక ప్రేమ బాధితురాలు.
* " గొడుగుతో ఉంటే అది వానాకాలం, కూలర్ తో ఉంటే అది ఎండాకాలం, స్వెటర్
తో ఉంటే అది చలికాలం, లవర్ తో ఉంటే అది పోయే కాలం! " ఒక ప్రేమ
బాధితుడు.
* " అబ్బాయిలు ప్రేమించే మనసును చూడరు, ఆకర్షించే అందాన్నే చూస్తారు..ఛీ
ఛీ...ఈ అబ్బాయిలు ఎప్పుడు మారుతారో ఏమో " ఒక ప్రేమ బాధితురాలు.
* " అమ్మాయిలు కూడా అంతే ! ప్రేమించే మనసును చూడరు, నిండుగా ఉండే
పర్స్ నే చూస్తారు " ఒక ప్రేమ బాధితుడు.
* " అమ్మాయిలు చదవరు, అబ్బాయిల్ని చదవనీయరు, కాని బాగా
చదువుకున్న మొగుడు కావాలి...ఏంటో ఈ అమ్మాయిలు ! " ఒక ప్రేమ
బాధితుడు.
* " అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకురారు. పెళ్లి
చేసుకునేటప్పుడు ప్రేమించినవాడు గుర్తుకు రాడు. అందుకేరా బాబు
అమ్మాయిలను నమ్మకూడదు " మరొక ప్రేమ బాధితుడు.
* " ప్రేయసి కోసం ఒక ప్రియుడు తాజ్ మహల్ కట్టాడు కాని ప్రియుడి కోసం ఒక
ప్రేయసి చిన్నగుడిసె అయినా కట్టిందా ! " ఒక ప్రేమ బాధితుడు.
|