ఇద్దరూ స్నేహితులు
ఇద్దరూ స్నేహితులు సరదాగా మాట్లాడుకుంటున్నారు.
“ సుందరం...అమ్మ అల్లం, ఆలి బెల్లం అంటారు కదా! ఎందుకురా ?” అని అమాయకంగా
అడిగాడు ఆనందం.
“ ఎందుకంటే...అల్లం ఆరోగ్యం. బెల్లం అనారోగ్యం కాబట్టి " అని చెప్పి పకపక నవ్వాడు
సుందరం.
అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు ఆనందం.