Varsham Kurisina Ratri

వర్షం కురిసిన రాత్రి

చంద్రమ్మకు నలబై సంవత్సరాలు. నవయవ్వన అందగత్తెనని విర్రవీగేది. ఆమెకున్న

తెల్లజుట్టు కనబడకుండా హెయిర్ డై చేసుకుని బయటికి వెళ్ళేది. ప్రతిరోజులాగే ఆ రోజు

కూడా హెయిర్ డై చేసుకుని ఒక పార్టీకి వెళ్ళింది. ఆ పార్టీలో తెగతాగి వానలో నాట్యం

చేయడం మొదలుపెట్టింది.

కొద్దిసేపటి తరువాత అసలు రూపం బయటపడి వికృతంగా తయారయింది. కొందరు

హేళనగా నవ్వారు. మరికొందరు ఆనందంగా నవ్వారు.ఇంకొందరు బాగా జరిగిందనే

కుతూహలంతో నవ్వారు. వాళ్లకి ముఖం చూపించలేక సిగ్గుతో ఇంటికి వచ్చింది.

వికృతంగా ఉన్న భార్యను చూసి అదిరిపడ్డాడు భర్త.

" ఏవండీ...నేనండీ...నీ చంద్రాన్ని " అని చెప్పింది భార్య.

" నువ్వా చంద్రం...నేను దెయ్యం అనుకున్నాను " అని కుదుటపడ్డాడు ఆ భర్త.

" అబ్బా చాల్లెండి మీ పోగర్త " సిగ్గుపడుతూ అంది చంద్రమ్మ.

" నీ సిగ్గు సంతకెళ్ళ..అదేంటే అలా ఉన్నావు " అని అడిగాడు భర్త.

" వర్షం కురిసిన రాత్రి బట్టబయలయ్యాను " అని దీనంగా చెప్పింది చంద్రమ్మ.