Ullasanga Utsahanga Lovely Jokes

Ullasanga Utsahanga Lovely Jokes

ఉల్లాసంగా ఉత్సాహంగా లౌలీ జోక్స్

" స్కూటర్ మా ఇంట్లో ఓ మెంబర్ లాంటిది " అని చెప్పాడు కార్తిక్.

" కావొచ్చు. కాని దానిని ఇలా రేషన్ కార్డులో చూపించడం ఏమీ బాగాలేదు " అన్నాడు

రేషన్ ఆఫీసర్.

************

" రోజా ! నేనెప్పుడు ముద్దు పెట్టిన కళ్ళు ఎందుకు మూసుకుంటావు " అని ప్రేమగా

అడిగాడు నాగబాబు.

" నీ చండాలమయిన ఫేసుని క్లోజప్ లో చూడలేక నాగ్ " అని చెప్పి గబుక్కున

నాలిక్కరుచుకుంది రోజా.

************

" చిత్ర పరిశ్రమలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న మీరు రాజకీయలలోకి కూడా

ప్రవేశిస్తారా ? " అని ఒక హీరోయిన్ని అడిగాడు విలేకరి.

" భలేవారే ! నాకింకా ఓటువేసే వయస్సే రాలేదు " అని చిలిపిగా నవ్వుతూ చెప్పింది.

***********

" చాలా బలహీనంగా వున్నారు. ఏమేమి తింటున్నారు ? " అని అడిగాడు డాక్టర్.

" చెప్పలేనన్ని తన్నులండి " అని నీరసంగా చెప్పాడు పేషెంట్.

*************

" మీ కొడుక్కి కోడల్కి ఒక్క నిమిషం కూడా పడదటగా ? " అని అడిగింది పక్కింటి

పార్వతి.

" అందుకే నేను సంతోషంగా వుండగలుగుతున్నాను " అని చెప్పి గబుక్కున

నాలిక్కరుచుకుంది.