Ullasanga Utsahanga Asalu Sangati Joke

Ullasanga Utsahanga Asalu Sangati Joke

" ఉల్లాసంగా ఉత్సాహంగా స్పెషల్ " అసలు సంగతి

" ఈ తాగుడు అలవాటు ఎన్నాళ్ళ నుంచి మీకు వుంది ? " అని పేషెంట్ పాపయ్యని

అడిగాడు హిప్నాటిస్ట్ కిశోర్.

" పదేళ్ళ నుంచి " అని చెప్పాడు పేషెంట్ పాపయ్య.

" ఓ.కే. నేను హిప్నాటిజం చేసి మీ అలవాటు మాన్పిస్తాను " అని చెప్పాడు హిప్నాటిస్ట్

కిశోర్.

" అలాగే డాక్టర్ " అని బుద్దిగా అన్నాడు పేషెంట్ పాపయ్య.

" గుడ్...కళ్ళు మూసుకో " అని చెప్పాడు హిప్నటిస్ట్ కిశోర్.

పాపయ్య ఏమి మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు.

" ఇప్పుడు మీరు పదేళ్లు వెనక్కి వెళుతున్నారు...వెళుతున్నారు...వెళ్లారు " అని

అంటూ చేతులూపుతున్నాడు హిప్నాటిస్ట్ కిశోర్.

" అయ్యబాబోయ్...అసలు సంగతే మరిచా..మీకో దండం..అప్పుడు మా ఆవిడ బతికే

ఉంది " అంటూ పరుగు తీశాడు పాపం పాపయ్య.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అలా చూస్తుండిపోయాడు హిప్నాటిస్ట్ కిశోర్.

రచన - శాగంటి నర్సింగరావు