TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Hero-Zero
శాగంటి కిరణ్ కుమార్
చిత్తురాజ్ చిత్తైపోయాడు
'చిత్తురాజ్' ఎవరు అని ఏ చంటిపిల్లాడిని అడిగిన,అతడొక గొప్ప హీరో అని,పెద్ద హీరో అని,బాగా నటిస్తాడని,ఏడిపిస్తాడని,నవ్విస్తాడని టక్కున చెప్పేస్తాడు.మరి అంతా పెద్ద హీరో మన చిత్తురాజ్ గారు.
హీరోగా ఎన్నో సినిమాలలో నటించి అన్యాయాన్ని, అక్రమాల్ని ఎదిరించే పాత్రలలోకనిపించి ప్రేక్షకులను అభిమానాలతో పాటు 'రియాల్టీ హీరో',డేరింగ్ హీరో,డైనమిక్ హీరో,ఇలాంటి బిరుదులతో పాటు జీరో హీరో,డూప్లీకేట్ హీరో,అని ఎన్నో బిరుదులను సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా హాస్య సినిమాల్లో నటించి నవ్వులు పంచి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నాడు మన చిత్తురాజ్. అయితే షరా మామూలుగానే అందరు హీరోలలానే సినీ ఫీల్డ్ లో కొనసాగుతూన్న సమయంలోనే ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లింది.
మరింకెందుకు ఆలస్యం అంటూ పోటీ చేసాడు. ఎంతైనా సినిమా వాడు, పైగా తన సినిమాలతో పగలబడి నవ్వించాడు కదా... రాజకీయాల్లో కూడా అలాగే నవ్వుతూ ప్రజలకి మంచి చేస్తాడని భావించి ఆయన్ని పార్లమెంటు సీటెక్కించారు.
అక్కడే ఆ నియోజకవర్గం ప్రజలు తప్పులో కాలేసామని తెలుసుకున్నారు. ఏదో వెలగబెడతాడని తాము చిత్తురాజ్ ని గెలిపిస్తే ఆయన మాత్రం గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా తనను గెలిపించిన ప్రజల మోహాలను చూడ్డానికి వెళ్ళలేదు.
హాయిగా ఎంచక్కా తన సినిమా షూటింగులతో తెగ బిజీ అయిపోయి ప్రజలని మరిచిపోయాడన్నమాట. ఆయన బాధని అర్థం చేసుకుని ఇవ్వాళ కాకపొతే రేపైనా వస్తాడు గదా అనే ఆశతో, సహనంతో ఎదురు చూసీ, చూసీ విసిగిపోయారు జనాలు. ఇక తమ చిత్తురాజ్ తెరపైనే కానీ తమముందుకి వచ్చేలా లేడని నిర్ధారించుకున్న జనం ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించేశారు.
ఎందుకో తెలుసా? కనిపించకుండా పోయిన తమ ఎం.పి.చిత్తురాజ్ ని పట్టుకొచ్చిన వారికి అక్షరాలా కోటి రూపాయలు నజరానా అని చిత్తురాజ్ ఫోటోతో పెద్ద కటౌటు పట్టుకుని వీధి వీధిలో తిరిగారు. ఈ సంగతి తెలిసిన చిత్తురాజ్ కి బి.పి. రెయిజైపోయింది.
ఎంచక్కా షూటింగ్ లు చేసుకుంటూ హాయిగా ఉన్న తనకు ఆఫ్ట్రాల్ ఓ పార్లమెంటు సీటు ఇప్పించినందుకు తనపైనే కోటి రూపాయల నజరానా ప్రకటిస్తారా? అనుకుని తెగ ఫీలయిపోయి... అసలేం చేస్తున్నాడో తెలియని విధంగా తన షూటింగ్ చూడడానికి వచ్చిన ఓ అభిమాని చెంప చెళ్ మనిపించాడు.
ఇంత టెన్షన్ పడే బదులు.... కనీసం ఆర్నెల్లకోసారైనా తనని గెలిపించిన జనాల ముందు ప్రత్యక్షమయి వారితో కాసేపు మాటామంతీ జరిపి వస్తే యవ్వారం ఇంతదూరం వచ్చేది కాదు గదా! ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిన మన హీరో చిత్తురాజ్,ఈ విధంగా చిత్తైపోయాడు పాపం.
|