TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అప్పల రాజు అమాయకత్వం
అదొక మారుమూల పల్లెటూరు. అక్కడ ప్రజలు కూడా అమాయకులు. అలాంటి ఊళ్ళో ఓవ్యక్తి ఒక చోట కూర్చుని కొన్ని రకాల మూలిక ఔషధాలు అమ్మసాగాడు.
" అయ్యలారా...అమ్మలారా...రండి ! ఈ మహాద్భుతాన్ని అందుకోండి. ఇదిగో...నా చేతిలో ఉన్న ఈ సీసాలోనిది సంజీవిని ఔషధం. ఇది గనుక త్రాగితే ఖచ్చితంగా ఐదు వందల సంవత్సరాల వరకూ ఎలాంటి రోగాలు దరిచేరకుండా బ్రతుకుతారు " అంటూ అరవసాగాడు.
" నువ్వు చెప్పేది నిజమా ?" అని అడిగాడు అప్పలరాజు.
" నిజం బాబూ ! నేను నాలుగు వందల యాబై సంవత్సరాల కిందట తాగాను. ఇంకా బ్రతికే ఉన్నాను " అన్నాడు ఆ మూలికలు అమ్మే వ్యక్తీ.
అయినా అప్పలరాజుకి అనుమానం తీరక అతని పక్కనున్న వ్యక్తీ దగ్గరికి వెళ్లి నెమ్మదిగా " నువ్వు ఇతని దగ్గర పనిచేస్తున్నావు గదా ! ఇతను చెప్పేది నిజమా " అని అడిగాడు.
" ఏమో...నాకు తెలియదండి...ఎందుకంటే నేను ఇతని దగ్గర కేవలం మూడు వందల సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను " అని ఆనాడు అతను.
ఏది నమ్మాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు అప్పలరాజు.
|