Nagalaraani-Jeansugaadu

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

('బందిపోటు'చిత్రంలో "వగలరాణిని నీవె "అనే పాటకు పేరడీగా)

నగలరాణి - జీన్సుగాడు

పల్లవి: నగలరాణివి నీవె

        జీన్సుగాడిని నేనే

       ఈడు కుదిరెను జోడు కుదిరెను

       కారు దిగిరావె  "నగల"

చరణం : ఆస్తులన్నీ నాకోసం

          అప్పులన్నీ నీ కోసం

         మామ కట్టిన ఐదుగదుల ఇల్లు మనకోసం   "నగల"

చరణం : పిండి వంటలు నాకోసం

         పిల్ల పాపలు నీకోసం

         ఇంటి పనులూ వంట పనులూ అన్ని మన కోసం "నగల "

చరణం : ప్రేమ అంతా పైపైనే

         ఆశలన్నీ లోలోనే

         ఆస్తి దొరికిన మరుక్షణమే పారిపోదునులే    "నగల "

చరణం : కట్నమిచ్చిన చినదానా

         వెర్రి చూపుల పిలదానా

        అదురుటేందుకు బెదురుటేందుకు నీ మొగుడనేగానా  "నగల "

(హాసం సౌజన్యంతో)