Navvule Navvulu 12

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

నవ్వులే నవ్వులు - 12

క్షవరం

“పెద్దపేగులతో కలపబడే సన్నని గొట్టాన్ని తొలగించరానుకో...దాన్ని ఎపెన్ డేక్టమీ అంటారు...అదే గొంతులో కండ తొలిగించడాన్ని టాన్సి లెక్టమీ అంటారు.నీ తల మీద పెరిగేదాన్ని తొలగించారానుకో డాన్ని ఏమంటారో తెలుసా ?”అడిగాడు గోవిందం.

“నాకైతే తెలీదు...”అన్నాడు అరవిందం.

“ఆ మాత్రం తెలీదా...క్షవరం అంటారు "అని చెప్పి పకపక నవ్వాడు గోవిందం.

అరవిందం మాత్రం అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.

బిల్లు లేని వెలుగు

“మెరుపుకీ...విద్యుత్తుకీ తేడా ఏంటో చెప్పగలరా ?” అడిగేరు సైన్సు టీచర్.

“మెరుపుకయితే బిల్లు కట్టనవసరం లేదు సార్...”ఠక్కున చెప్పాడు ఓ కుర్రాడు.

“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ సైన్సు టీచర్.

మతిమరుపు ప్రొఫెసర్

మతిమరుపు ప్రొఫెసరు గారు పాఠం ముగించి క్లాసు నుంచి వెళ్ళిపోతూ..."నా కోటు ఎవరైనా చూశారా?” అని అడిగేడు.

“మీరే వేసుకున్నారు కదా సార్...”చెప్పారు పిల్లలంతా.

“థాంక్యూ...మీరే గనక చెప్పక పోయివుంటే అది లేకుండానే వెళ్లిపోయివుండేవాడిని...”అన్నాడు మతిమరుపు ప్రొఫెసర్.

పిల్లలందరూ పకపక నవ్వారు.

అమ్మవంట

“నువ్వు భోంచేసే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తావా..?”అడిగాడు హరి.

“అవసరం లేదు...మా అమ్మ వంట బానే చేస్తుంది "అని చెప్పి కిలకిల నవ్వాడు గిరి.

అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు హరి.

అవమానింపబడటం

“నేను అవమానింపబడటానికి యిక్కడికి రాలేదు...”కోపంగా అన్నాడు కోదండం.

“మరి సాధారణంగా ఎక్కడికి వెళ్తుంటారేమిటి ?”వ్యంగ్యంగా అంటూ నాలిక్కరుచుకున్నాడు రామదాసు.

(హాసం సౌజన్యంతో)