Konte Questions-Tuntari Jawabulu-2

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

కొంటె కొశ్శెన్లు -తుంటరి జవాబులు 2

*******************************************************************

వి.మంజురాణి,హైదరాబాద్.

కొంటె కొశ్శెన్:త్రికాలవేది అంటే ఎవరు?

 తుంటరిజవాబు:పొద్దున్న,మధ్యాహ్నం,సాయంత్రం...ఎండాకాలం,వర్షాకాలం,చలికాలం

ఇలా మూడు కాలాలూ వేదికలపైకి పిలవకపోయినా హాజరైపోయే వారిని ప్రస్తుతం 'త్రికాల

వేది' అంటున్నారు

*******************************************************************

రమణ శాస్త్రి,సంగారెడ్డి.

కొంటె కొశ్శెన్: మన దగ్గరున్న కరెన్సీ నోటు దొంగానోటో కాదో ఎలా తెల్సుకోవడం ?

తుంటరి జవాబు: వెళ్లి పోలీసు పక్కన నిలబడండి.దొంగ నోటయితే గజగజా వణికిపోతుంది.

*******************************************************************

కొంటె కొశ్శెన్:ఓ జంటకి పెళ్ళయి ఎన్నేళ్ళయిందో ఎలా తెలుసుకోవచ్చు ?

తుంటరి జవాబు :నడిచేటప్పుడు వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని బట్టి.

*******************************************************************

కొంటె కొశ్శెన్ :నిజం నిష్ఠూరంగా ఉంటుందనేది అనుభవంలోకి వచ్చేదెప్పుడు?

తుంటరి జవాబు : అద్దం ముందు నిలబడినప్పుడు.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : పరిశుభ్రతకు అతిగా ప్రాధాన్యతనివ్వడం అంటే ?

తుంటరి జవాబు : బట్టలతోపాటు జంధ్యం మొలతాడు కూడా ఉతకడానికి వెయ్యటం.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : ఒకమ్మాయి పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను ఎంగేజ్ మెంటుకు ఒక

రింగు, వెడ్డింగుకు ఒక రింగు ఉంటే సరిపోతుందా?

తుంటరి జవాబు : సరిపోదు.ఈ రెండు రింగ్ లతో పాటు పెళ్లయ్యే దాకా

ముచ్చటించుకోవడానికి వీలుగా రింగు ఇవ్వడానికి ఫోన్ ఉండాలి.ఈ రింగ్ లన్నీ ఉన్న

లేకున్నా పెళ్ళయిన తరువాత ఖచ్చితంగా మీరు స్వీకరించాల్సిన రింగ్ ఒకటుంటుంది అదే

సఫరింగ్.అందుకే అన్నిటికన్నా ముఖ్యం డేరింగ్ సో పెళ్ళంటే యిన్ని రింగులు కావాలి మరి.

*******************************************************************

మరిన్నీ కొంటె కొశ్శెన్లు -తుంటరి జవాబులతో మళ్ళీ కలుద్దాం.

(హాసం సౌజన్యంతో)