Chamatkara Hashyam-1

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

చమత్కార హాస్యం -1

' పన్ 'డితుడు శంకర నారాయణ

ఫన్ చేయడానికి భాషపై మంచి పట్టు ఉండాలి.మాటను విరిచో,వేరే అర్థంలో ప్రయోగించే చమత్కారాన్ని పన్ డించడం అంత సులభమేమీ కాదు.

శంకరనారాయణ ఈ విధ్యలో సిద్ధహస్తులని ఇప్పటికే ఋజువు చేసుకున్నారు.

తెలుగు,ఇంగ్లీష్ కొండొకచో హిందీ, సంస్కృతం భాషా పరిజ్ఞానాలను కలగలిపి ఎన్నో ప్రయోగాలు చేశారు. వీరు చేసిన ప్రయోగంలోని వివిధ అధ్యాయాలను పరిశీలించి చూస్తే, పూర్తి ఇంగ్లీష్ మాటనే విరిచి, లేదా వేరే అర్థంలో పుట్టించిన హాస్యం ఏమిటో చూద్దాం.

వృత్తులపై...

అన్నదాతలు 'ధాన్యజీవులు'.

మత్య్సకారుల కంటబడితే చేపలకూ పో'గాల'మే.

పశువుల డాక్టర్లు చేసేది 'గొడ్డు చాకిరీ'

టైలరింగ్ అంటే 'కుట్టు చప్పుడు'వ్యవహారం.

పరిశ్రమల పితామహుడు'తాతా'.

అరబ్ షేకులు ఇం 'ధనవంతులు'.

పాదరక్షల వ్యాపారంలో అన్నీ'చెప్పు'డు మాటలే!

డాక్టర్లకు'నయానా'డబ్బు 'భయానా'డబ్బు.

హోటళ్లలో ఇడ్లీకి'వడ'దెబ్బ.

అందరినీ కొలిచేవాడు టైలర్.

'చెరిపినా'చెడనివాడు టీచర్!

కార్డియాలజిస్టులు'గుండెలు తీసిన బంట్లు'.

నేటి ధన్వంతరులు'ధనవంత'రులు.

గూఢచారులకు ఉండేది 'కూపీరైట్'.

వాస్తు వేత్తలు 'వెయ్యిళ్ళ పూజారులు'.

'వెల'యాలు సతీ'మని'.

సబ్ ఎడిటర్లు వేసేవి'శీర్షికాసనాలు'.

రక్తం కళ్ళజూసి సంతోషించేవి'బ్లడ్ బ్యాంకులే'.

(హాసం సౌజన్యంతో)