Indravaram

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

“ఇంద్రవరం"

“క్రోక్విల్"నరసింహం

తెలుగువాడు అయిన సుబ్బారావుకి ఓ బ్రాహ్మీముహూర్తాన బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది.

తన పేరు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయేలా ఏదన్నా మహత్తర కార్యం చేయాలి అని.

తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి చాలా వుంది.కానీ ఏం చేయాలో తెలియటం లేదు. సరే ఓ రోజున వూరి బయట కొండపై తపస్సు ప్రారంభించాడు.

వెంటనే పనిలేని ఇంద్రుడు డింగ్ న ప్రత్యక్షం అయి "ఏం కావాలి ?”అని అడిగాడు. సుబ్బారావు తన మనస్సులోని కోరిక చెప్పాడు.

“సి.యం.అవుతావా ?”

“వద్దు వద్దు స్వామి.ఆ పదవి 20 ఏళ్ళదాకా ఖాళీ అయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు " చెప్పాడు సుబ్బారావు.

“ప్రతిపక్ష నాయకుడివి అవుతావా ?”అడిగాడు ఇంద్రుడు.

“అంత వైస్సు లేదు స్వామీ !”అన్నాడు సుబ్బారావు.

ఏం వరం యివ్వాలో ఇంద్రుడికి అర్థం కాక కిరీటం తీసి బుర్రగోక్కున్నాడు. అప్పుడు తట్టింది సూపర్ రిన్ మెరుపులా ఓ ఐడియా!

“భక్తా !యింతవరకు ఏ భక్తుడికి యివ్వంది నీకు యిస్తున్నాను.ఓ ఉచిత సలహాలాంటి వరం " అన్నాడు ఇంద్రుడు.

“శలవివ్వండి స్వామీ !”

“తెలుగు ఛానెల్ కి ఓ ధారావాహిక డైలీ సీరియల్ (ఏడ్పు గొట్టుది)ప్రారంభించు.అది ఎప్పుడు పూర్తీ అవుతుందో తెలియదు కాబట్టి,ఆ సీరియల్ వస్తున్నంతకాలం ప్రేక్షకుల గుండెల్లో నొప్పినా కలకాలం నిలిచి పోతావు "అని వరమిచ్చి 'డింగ్'న మాయం అయ్యాడు ఇంద్రుడు.

(హాసం సౌజన్యంతో)