Humour Box

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

హ్యూమర్ బాక్స్

బట్టతల మావగారు

“మా మావగారికి ఎనబై రెండేళ్లురా...అయినా తలమీద ఒక్క నెరిసిన వెంట్రుక కూడా కనబడదు తెలుసా..”చెప్పాడు మొదటి వ్యక్తి.

“చాలా ఆశ్చర్యంగా వుందే...”అన్నాడు రెండో వ్యక్తి.

“ఇందులో ఆశ్చర్యం ఏముంది.ఆయనది పూర్తిగా బట్టతల మరి "అని అసలు సంగతి చెప్పి పకపక నవ్వాడు మొదటి వ్యక్తి.

అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు రెండో వ్యక్తి.

కారు అమ్మేసిన పేషెంట్

“డాక్టరు గారూ...మీరు చెప్పింది అక్షరాలా నిజమయ్యింది.నేను అతి తొందరలో నడుస్తానని మీరు చెప్పారుగా...”అన్నాడు పేషంట్.

దానికి ఆ డాక్టర్ సంబర పడుతూ "మంచిది నాయనా...ఎప్పటి నుండి నడవటం మొదలు పెట్టావేంటి ?” అడిగాడు.

“మీ బిల్లు చెల్లించిన మరుక్షణం నుండి డాక్టర్...?”

"అదేంటి "కొంచం అర్ధం కానట్టుగా అడిగాడు డాక్టర్.

“అవును డాక్టర్...ఆ బిల్లు చెల్లించడానికి నా కారు అమ్మేయాల్సి వచ్చింది కాబట్టి "అని చెప్పగానే "ఆఁ..”అని నోరు తెరిచాడు డాక్టర్.

ఏడాది పాప

“మా చిన్నపాపకు యిప్పుడు ఏడాది వయస్సుంటుంది.ఎనిమిదో నెల నుంచి నడవటం మొదలు పెట్టింది తెలుసా..”గర్వంగా చెప్పింది ఓ తల్లి.

“నిజంగానా?అయితే ఈ పాటికి మీ పాప నడిచి నడిచి చాలా అలిసిపోయి ఉండాలే...”వెటకారంగా అని పకపక నవ్వాడు ఇంటికి వచ్చిన అతిధి.

అయోమయంగా చూస్తూ ఉండిపోయింది ఆ తల్లి.

ఊరి మహత్యం

“ఈ వూరు నివసించడానికి బాగానే వుంటుందా ?”అడిగాడు కొత్తగా వ్యక్తి.

“బానే వుంటుంది సార్...నేను యిక్కడకు వచ్చిన కొత్తలో నడవలేక పోయేవాణ్ణి...గట్టిగా వున్నా ఆహారం తినలేకపోయే వాణ్ణి...మరిప్పుడు చూడండి ఎలా వున్నానో...”చెప్పాడు ఆ వూరి వ్యక్తి.

“అయితే ఈ వూరిలో చాలా మహత్యం వుందన్నమాట "అన్నాడు ఆ కొత్త వ్యక్తి ఆశ్చర్యపోతూ.

“మహత్యం లేదు ఏమిలేదు సార్...వాడు పుట్టింది పెరిగింది ఈ ఊళ్లోనే...”అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు పక్కనే వున్నఆ వూరి మరో వ్యక్తి.

తెలివైన ముసలావిడ

“మీకు నూట పది సంవత్సరాలు వచ్చాయి కదా...మీరు యింతకాలం జీవించగలడానికి గల ముఖ్య కారణం ఏంటి ?”ఒక ముసలవ్వ దగ్గరికి వచ్చి అడిగాడు విలేకరి.

ఆవిడ కాసేపాగి "నేను నూట పది సంవత్సరాల క్రితం పుట్టడం వలెనే అయి వుంటుంది...”అని తెలివిగా చెప్పింది ఆ వృద్ధురాలు.

"ఆఁ..”అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ విలేకరి.

 

(హాసం సౌజన్యంతో)