Navvule-Navvulu 10

నవ్వులే నవ్వులు 10

ఊటీ బిక్షగాడు

“ఇవాళ ఒక్కరోజే బిక్షం వెయ్యండమ్మా.మళ్ళీ మూడు నెలలదాక కనబడను "అన్నాడు

బిక్షగాడు.

“మీ ఊరుకు వెళ్తున్నావా ?”అడిగింది కమల.

“ఎండాకాలం వచ్చేసింది కదమ్మా.అందుకే ఊటీ వెళ్తున్నా!”చెప్పాడు బిక్షగాడు.

“ఆఁ..”ఆశ్చర్యంగా నోరు తెరిచింది కమల.

అటక మీది మొగుడు

 

“అటకమీద వాడెవడే? ”కోపంగా అడిగాడు ఆనంద్.

“మీరిందాక వెళ్ళిన దాని మొగుడు...”తాను కోపంగా

చెప్పింది భవాని.

“ఆఁ..” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆనంద్.

 

 

పేషెంట్ కాని భర్త

“ఆ స్వీట్సూ,ఈ పాలు తాగి హాయిగా నిద్రపోండి.ప్లీజ్ టేక్ రెస్ట్ "శోభనం గదిలో అన్నది భార్య.

“హు...నేరకపోయి నర్సుని కట్టుకున్నాను.నేనేమైనా నీ

పేషెంటునానుకున్నావా ?”అంటూ తల బాదుకున్నాడు పేషెంట్ కాని భర్త.

నీ భార్య - నా భార్య

“నా భార్య ఎప్పుడూ తన మొదటి భర్త గురించి చెబుతుందిరా!”బాధగా అన్నాడు సంజయ్.

“నీ భార్యే నయంరా! నా భార్యయితే ఎప్పుడూ తనకు కాబోయే భర్త గురించే

చెబుతుంటుందిరా "విషాదంగా చెప్పాడు అజయ్.

“ఆఁ...”అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సంజయ్.

డ్రాయర్ గుర్నాధం

“ఈ కాగితాన్ని డ్రాయర్ లో పెట్టవయ్యా "అన్నాడు మేనేజర్ గుమాస్తా గుర్నాధంతో.

“సారీ సార్ !నేనివాళ డ్రాయర్ వేసుకోలేదు...”అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు డ్రాయర్

గుర్నాధం.