Lavaru Kosam-Lovaru Kosam

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

(ప్రేమ్ నగర్ చిత్రంలోని "ఎవరికోసం "అనే పాటకు పేరడీగా)

తాళా భక్తుల లక్ష్మీ ప్రసాద్

లవరు కోసం- లవరు కోసం

పల్లవి : లవరు కోసం...లవరు కోసం.

ఈ ప్రేమ సంకటం...ఈ జిడ్డు లంపటం.

ఈ చిత్త భ్రమణం...ఈ నిత్యగ్రహణం.

లవరు కోసం... లవరు కోసం... లవరు కోసం...

చరణం : ప్రేమ మేకు తానే కొట్టి

ఈ పేదమదికి చిల్లుపెట్టి

ముష్టివాణ్ణి కర్రలేని కుంటివాణ్ణి చేసింది

నేనడిగినది ఇవ్వలేదు

అది ఎందుకని అగడలేదు

బ్రతుకు కంపు చేసింది

చితక బాది వెళ్ళింది

లవరు కోసం... లవరు కోసం... లవరు కోసం...

చరణం : తొక్కలోని ఈ తనువే శవమై కడతేరనీ

నా లవరు లేని ఈ కొంపే తుఫానొచ్చి పడిపోనీ

బాంబుపేలి కుప్పలా కూలిపోనీ

ఉప్పెనొచ్చి ఇసుకలో కలవనీ

లవరు కోసం... లవరు కోసం... లవరు కోసం...

చరణం : ఆస్తి పంచమన్నాది

అదేం కుదరదన్నాను.

కల్లు తాగమన్నాది

జుట్టు పీక్కున్నాను.

దాన్కి లవ్వంటే లెక్కలేదు

నాకు మందేమి కొత్తకాదు

ఈ విరహంతో మిగిలాను

ఈ విస్కీ తో తగలబడతాను...

హుహ్హూ...హుహ్హు...హుహ్హు...తగలబడతాను.

హుహ్హు...హుహ్హు...హుహ్హు...

లవరు కోసం... లవరు కోసం.... లవరు కోసం....

(హాసం సౌజన్యంతో)