Navvule-Navvulu-9

నవ్వులే నవ్వులు - 9

మీ ఆవిడ - మా ఆయన

“మా ఆవిడ వచ్చే టైం అయ్యింది.ఇక వెళ్ళు

సుధ!”అన్నాడు రాజు.

“మీ ఆవిడ మా ఆయనతో కలిసి సినిమా కెళ్ళటం చూసే

నేనోచ్చాను.మీరేం కంగారు పడకండి "అంది

సుధ చిలిపిగా నవ్వుతూ.

“ఆఁ..”అని నోరుతెరిచాడు రాజు.

 

బుద్ధిలేని నాన్న

“నా కొడుక్కి బుద్ధిలేక లెక్కలు చేసిచ్చా ?”అని చెప్పాడు సుబ్బారావు,రామనాధంతో.

“ఏమైందేమిటి ?”అడిగాడు రామనాధం.

“లెక్కలన్నీ తప్పులని నన్ను కొట్టించడానికి వాళ్ళ టీచర్ ను ఇంటికి తీసుకొచ్చాడు"అని

చెప్పుతూ బోరున ఏడ్చాడు సుబ్బారావు.

గుడిపూజారి క్రికెట్ పిచ్చివాడు

“మా ఊళ్ళోని గుడి పూజారి క్రికెట్ పిచ్చివాడురా

"చెప్పాడు రాము.

“ఎలా చెప్పగలవురా ?”అడిగాడు కిశోర్.

“కొబ్బరికాయను కొట్టి ఇవ్వమన్నప్పుడల్లా ఆయన తొడకి

రాసి మరీ కొడతాడు కాబట్టి"అని

చెప్పి పగలబడి నవ్వుతుంటాడు రాము.

అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు కిశోర్.

పూలదండ

“ఆపరేషన్ థియేటర్లో పూలదండ ఎందుకు పెట్టారండి ?'అడిగాడు పేషెంట్ అమాయక్.

“ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్ గారికి వేయడానికి.ఫెయిలయితే పేషెంట్ కు వేయడానికి

..”అని చెప్పి నాలిక్కరుచుకుంది నర్స్.

మాతృత్వవరం

“మాతృత్వం అనేది ఒక తియ్యటివరం.అది నేను నీకిప్పుడు ప్రసాదించబోతున్నాను "శోజనం

గదిలో పావనితో అన్నాడు ఆదర్ష్.

“ప్లీజ్...వద్దండి..గతాన్ని తవ్వొద్దు.మళ్ళీ నాకు

మాతృత్వం గురించి గుర్తు చెయేద్దు "అంటూ

నాలిక్కరుచుకుంది పావని.

“ఆఁ..”అని నోరు తెరిచాడు ఆదర్ష్.