Navvule-Navvulu-8

నవ్వులే నవ్వులు - 8

కరెంట్ షాక్

“నిన్న ప్లగ్ లో వేలు పెడితే షాక్

కొట్టిందోయ్?” వేలు చూసుకుంటూ

విచారంగా చెప్పాడు గుర్నాధం,

పక్క సీటు పరమేశ్వరంతో.

“అదా సంగతి?! అందుకే కాబోలు,

నిన్న సిటీ అంతా కరెంటు

పోయింది!” అని గొల్లుమని నవ్వాడు పరమేశ్వరం.

అర్జంట్ విషయం

పొద్దున మీ నాన్నగారు ఫోన్ చేశారు. అర్జంటగా మాట్లాడాల చెప్పాడు భర్త అరుణ్.

“పొద్దున ఫోన్ చేస్తే, ఇప్పుడా నాకు చెప్పడం? పైగా అర్జంటని చెప్తున్నావు"కోపంగా అడిగింది భార్య రాణి.

“ఏం చెయ్యమంటావు? ఇరుగిళ్ళకు, పొరుగిళ్ళకు కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఇప్పుడేగా వచ్చావు మరి....” అన్నాడు అరుణ్.

“ఆఁ..”అని నోరు తెరిచింది భార్య.

లేడి టీచర్

“ఫిజిక్సులో మంచి మార్కులే వచ్చాయి కానీ, మిగిలిన

వాటిల్లో ఇంత అధ్వాన్నమైన మార్కులు వచ్చాయి

యేమిట్రా?” అడిగాడు తండ్రి.

“ఏం లేదు ఫిజిక్సుకు మాత్రమే లేడీ చెబుతారు.. కనుకనే

ఆ సబ్జెక్ట్ శ్రద్ధగా విన్నాను....”అని చెప్పి

నాలిక్కరుచుకున్నాడు కొడుకు.

లంచగొండితనం

లంచగొండితనం మీద అనర్గళంగా చర్చ సాగుతోంది.

“ఇంతకీ, లంచగొండితనాన్ని నిర్మూలించాలంటే ఏం

చేయాలి?” అడిగాడో వ్యక్తి.

“ముందు దానిని చట్టబద్దం చేయాలి!” తాపీగా చెప్పాడు

రెండో వ్యక్తి.

స్టెనో గ్రాఫర్

“మా స్టెనో గ్రాఫర్ సామాన్యురాలు కాదు, రాజకీయ నాయకులను మించిన తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి!” అన్నాడు గోవింద్.

“ఏమయింది? ఎందుకలా అంటున్నావు?” అడిగాడు సురేంద్ర.

“ఆఖరికి షార్ట్ హాండ్ మిషన్ రిపేర్ అంటూ బిల్లు పెట్టి డబ్బులు దండుకుంది!” చెప్పాడు గోవింద్.

అది విని అవాక్కయ్యాడు సురేంద్ర.