Maa Avidaku Pati Dorikaadu

పొద్దున పదిగంటలు అయింది.ఆనందరావు నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నాడు.

ఇంట్లో వాతావరణం అంతా అస్తవ్యస్తంగా వుంది.అవతల ఆఫీసు టైమయిపోతోంది.ఇంకా

టిఫిన్ రెడీ కాలేదు.పిల్లల స్కూల్ బస్ మిస్ అయింది.

టిఫినుదేముంది ?బయట ఎక్కడైనా తినొచ్చు.కానీ అలా వెళ్ళిపోతే రామకి కోపం

వస్తుంది.అసలే అగ్గిబుగ్గి అయిపోతోంది.ఇంకా రెచ్చగొడితే ఏదైనా అఘాయిత్యం

చేస్తుందేమోనని భయం.

ఎంతసేపు కూర్చున్నా వంటింట్లోంచి వూడిపడదు. కాసేపు నీళ్ళు నమిలి వెలిగా

వంటింటివైపు వెళ్లాడు ఆనందరావు. పొయ్యి మీద వుంచిన పదార్ధం మాడిపోతున్నా

పట్టించుకోకుండా దిగులుగా నిలబడి వుంది రమ. స్టౌవ్ ఆపేసి భార్య భుజం మీద చెయ్యి

వేశాడు ఆనందరావు. పతీ అంటూ భ్రున ఏడిచింది రమ.

“ఏడవకు ఏడవకు..నేను ప్రయత్నం చేస్తున్నాను కదా!” అని ఓదార్చాలని విఫల ప్రయత్నం

చేశాడు ఆనందరావు.

“చేసేదంతా చేసి ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తే ఏం లాభం ?”వుక్రోషంగా సమాధానం చెప్పి

మళ్ళీ పతీ అంటూ ఏడుపు ప్రారంభించింది రమ. మరోసారి తల బాదుకుని బయటికి

వచ్చాడు ఆనందరావు.

అప్పుడే మెడ దిగి కిందికి వచ్చాడు బాబాయ్.

“ఒరే ఆనందా..ఇంకా టిఫిన్ రెడీ కాలేదా ?”అన్నాడు. పళ్ళు కొరుకున్నాడు ఆనందరావు.

ఇంతలో వాకిట్లోంచి వచ్చింది రాజ్యం అత్తయ్య.

ఆవిడ చేతిలో నవనవలాడుతున్న సొరకాయ వుంది.

“ ఒరే ఆనందా...ఇవాళెందుకో మీ మామయ్య తెగ గుర్తొస్తున్నార్రా!ఆయనకీ సొరకాయ

అవబెట్టిన కూరంటే చచ్చేంత ఇష్టం.పతిగాడెక్కడున్నాడో కాస్త తొందరగా చూడ్రా.వాడయితే

బాగా చేస్తాడు కూర "అంది ఆదరంగా.

కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది ఆనందరావుకి. చేతుల్లో మొహం దాచుకుని

కుళ్లికుళ్లి ఏడవసాగాడు.వంటింట్లోంచి వచ్చిన రమ, భర్త పక్కేనే కూర్చుని పతీ అంటూ

ఏడవసాగింది.

***

రమాపతికి ఇరవై ఏళ్ళుంటాయి.మెరికలాంటి వాడు.నమ్మకస్తుడు. రమ ఫ్రెండ్ ఇంట్లో

రెండేళ్లుగా పని చేస్తున్నాడు.ఆవిడ అమెరికాకు వెళ్ళిపోతూ రమ దగ్గరకు

పంపించింది.అతని గురించి ఫోన్ లో గొప్పగా చెప్తుంటే "ఎందుకు లేవే!”అంది

రమనిరాసక్తిగా.

"అలాకాదు నలుగురు వచ్చిపోయే ఇంట్లో ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలీదా.పైగా నీకేం

తక్కువ?బోలెడంత ఆస్తి...హాయిగా కాలు మీద కాలేసుకుని ఎన్ జాయ్ చెయ్యక..

ఎందుకొచ్చిన హైరానా నీకు..?”అంది రమ. మరికాసేపటికే వచ్చాడు రమాపతి.

రమ అతడిని చూడగానే "పని వచ్చా?నమ్మకంగా చేస్తావా!?”ఐ అడగలేదు.

“హీరోలా వున్నావ్.నీకెందుకీ పనులు.సినిమాల్లోకో,కనీసం టి.వి.ల్లోకి వెళ్లక

పోయావా"అంది. సిగ్గుగా నవ్వేశాడు రమాపతి.

“పొండి అమ్మగారూ"అంటూ.

ఇంటి పరిస్థితులని వివరించి చెప్పింది రమ. అన్నింటికీ తలాడించాడు రమాపతి.అన్నీ విని

కైకేయిలా తను కూడా మూడు వరాలు అడిగాడు.

మొదటిది జీతం మరో రెండొందలు ఎక్కువ ఇవ్వాలి.రెండవది ఇంట్లో పాచిపనికి తన మేనత్తని

పెట్టాలి.మూడవది నెలకి రెండు రోజులు శెలవు కావాలి.

అన్నింటికీ సరే అంది రమ.

సోమవారం నుండి పనికి వస్తానని చెప్పివెళ్ళాడు.సోమవారం తెల్లారేసరికల్లా మేనత్తని

వెంటబెట్టుకుని వచ్చాడు.

ఇద్దరూ కలిసి ఇంటిని హేండోవరు చేసుకున్నారు.పొద్దున్న పదిగంటలు అయ్యేసరికి ఇంటి

స్వరూపం మారిపోయింది.అద్దంలా వున్న ఇంటిని చూసి రమ భర్త ఆనందరావు

మురిసిపోయాడు.

ఇంటి పనులు,బజారు పనులు సమాస్తం చెయ్యడమే కాకుండా బాబాయ్ నీ,అత్తయ్యనీ

కూడా చాలా చక్కగా హేండిల్ చేస్తాడు.

“పెద్దయ్యగారూ!మధ్యాహ్నం మాయాబజార్ చూసేటప్పుడు నన్నూ పిలవండి "అని

ఆయనని సంతోష పెడుతాడు.

“పెద్దమ్మగారూ!లేత చింతకాయలు తెచ్చాను.మీ వారికిష్టంట కదా.పచ్చడి చేస్తా.తినండి.

ఆయనకీ అర్థభాగం తృప్తిగా ఉంటుంది" అంటాడు రాజ్యం అత్తయ్యతో.

వారం రోజులు తిరిగేసరికి రమాపతి లేకుండా అసలు ఇన్నాళ్ళూ ఎలా ఉన్నాం

అనుకున్నారు రమా, ఆనందరావు.అయితే అతని పేరుతోనే కాస్త చిక్కు వచ్చింది.

పనిలోచేరిన కొత్తలో

'రమాపతి...రమాపతీ...'ఐ పిలవడం

మొదలు పెట్టింది రమ.కానీ అప్పటిదాకా

కూనిరాగాలు తీస్తూ పని చేస్తున్న వాడు

సీరియస్ కావడంతో తెల్లబోయింది.

విషయమేమిటని అతని మేనత్త

అడిగారు.రమ,ఆనందరావు.

“అమ్మగారూ!మీకోమాట చెప్పాలి.

మావాడికి తన పేరంటే చాలా చిరాకు

వాళ్ళమ్మకి ఆడపిల్లలంటే ముద్దు.అందరూ

కొడుకులే.వీడే కడసారివాడు.అందుకే

ఆరేళ్ళువచ్చేదాకా జుట్టు

పెంచి,జడవేసి,పరికిణీలు కత్తి ఆడపిల్లలా పెంచింది.

ఆ వేషం చూసి,ఆడపిల్లలందరూ ఏడిపించేవారు.కాస్త పెద్దవగానే క్రాపు

చేయించేసుకున్నాడు. అయినా తన పేరులో ఆడతనం మిగిలిపోయిందని బాధ.పూర్తిపేరు

పెట్టి పిలిస్తే వాడికి చిర్రెత్తుకొచ్చింది "అని చెప్పింది అతని మేనత్త అడిగింది.

“మరైతే..'రమా!'అని పిలవ మంటావా?”అన్నాడు ఆనందరావు చికాగ్గా. “రామ

రామ...!అలా రమా ఐ పిలిస్తే పనొదిలి పోతాడు "అంది మేనత్త. ఆ దంపతుల గుండె రామంది.

“మరైతే ఏం చెయ్యమంటావు ?”అన్నారు ముక్తకంఠంతో.

“పతీ అని పిలవండి "అంది.

నెల రోజులు గడిచాయి.పిల్లలూ పెద్దలూ అందరూ రమాపతి పనిపట్ల ముగ్దులైపోయారు

.అన్ని పనులూ అతనికి అప్పచెప్పి నిశ్చింతగా వుండటం మొదలు పెట్టారు. ఓ రోజు

ఆనందరావు బంధువులు భోజనానికి వచ్చారు.

“అంతా బాగానే వుంది బావగారూ.ఆ పనివాడిని మా అక్క పతీ పతీ అని పిలవడం,మీరేమో

మా రమాపతి అని మురిసిపోవడం నాకు నచ్చలేదు సుమండీ మా అక్క రమ.వాడు

రమాపతి!మరి మీరెవరు!” అన్నాడు ఆ గుంపులోని బావమరిది వరసైన ఓ ప్రబుద్దుడు.

ఆనందరావు మనసు చివుక్కుమంది.

పైకి నవ్వేసి వూరుకున్నాడు. మరికొద్దిరోజులకే ఎవరో ఫ్రెండ్స్ వస్తే వాకిట్లోని వరండాలో కూర్చుని మాట్లాడుతున్నాడు ఆనందరావు.

లోపలి నుంచి "పతీ పతీ "అని అరిచింది రమ.

“మీ మిసెస్ పిలుస్తున్నారు "అన్నారు వాళ్ళు.

“అబ్బే నన్ను కాదండీ.మా పనివాడిని.” చెప్పాడు ఆనందరావు.

“ఏమిటీ మీ ఆవిడ...పనివాడిని పతీ అంటుందా...?మరి మిమ్ముల్ని ఏమంటుంది ?”అంటూ

భళ్ళున నవ్వేశారు.

ఈ సారి కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు ఆనందరావు.

ఆ రాత్రి రమతో చర్చించాడు.

“చాల్లెండి మీదంతా విచిత్రం.వాగేవాళ్ళు ఏదో వాగుతూనే వుంటారు "అనేసింది రమ. “అలా

కాదు రమా!వాళ్ళన్న దాంట్లో పాయింటు లేకపోలేదు "అన్నాడు ఆనందరావు.

“మరైతే పర్యవసానం ఆలోచించండి "అనేసి పడుకుని నిద్రపోయింది రమ.

ఆనందరావుకి మాత్రం నిద్ర పట్టలేదు.