Golden Jublee Korika

గోల్డెన్ జూబ్లీ కోరిక

అనుకోకుండా నలుగురు మిత్రులు వైజాగ్ లోని ఓ మేరేజ్ హల్లో కలుసుకున్నారు. ఒకళ్ళు

నొకళ్ళు చూసి గుర్తు పట్టడానికి కొంత టైం పట్టింది.

ఎందుకంటే వాళ్ళు ఒకర్నొకరు చూసుకుని చాలా కాలం

అయింది.యాబై ఏళ్లు. తాము కాలేజ్ లో చదువుకునే

రోజుల్లో క్లాస్ మేట్స్ గా గుర్తించాక వాళ్ళు ఉత్సాహంగా

పాత విషయాలు మాట్లాడుకో సాగారు.

క్రమేపి వాళ్ళ మాటలు వాళ్ళు ఆ రోజుల్లో ప్రేమించిన

యువతుల మీదకి మళ్ళింది. అక్కడ నుంచి వాళ్ళ భార్యల

మీదకి మళ్ళింది. ప్రతీవారు తాము తమ భార్యని ఎంత ప్రేమిస్తున్నారో పోటీ పడి

చెప్పుకోసాగారు. వాళ్ళల్లో ఒకరైన రామేశం చెప్పాడు.

“ నేను ప్రేమించిన గోదావరిని పెళ్లి చేసుకోలేదు. మా పెద్దలు కుదిర్చిన సంబంధమే

చేసుకున్నాను.సుఖ పడ్డాను. మా పెళ్ళయి ఏభై ఏళ్లయినా ఇంత దాకా నేను నా భార్యని

పల్లెత్తుమాటని ఎరగను.మా ఫిప్టీయత్ మేరేజ్ ఏనివర్సరీకి ఏం కావాలని అడిగితే మొదట

మేము హనీమూన్ కి వెళ్ళిన హొటల్ కి వెళ్లి అప్పుడు మేం వున్న గదిలోనే దిగుదామంది.

సరేనని ఆ ఏర్పాటు చేశాను.

“ ఏం హొటల్ అది " అడిగాడు కామేశం.

“ బందరులో రాధాకృష్ణ లాడ్జి "

కామేశం తన కీల్ కులెటర్ మీద టక టక కేలిక్యులేట్ చేసి పెదవి విరిచి చెప్పాడు.

“ ఓస్ ! మీ ప్రేమకి నిదర్శనంగా నువ్వు ఖర్చు చేసేది ఇంతేనా ? నేనైతే నా భార్య కోసం

ఇంతా ఎక్కువ ఖర్చు చేస్తున్నాను "

“ ఏం చేస్తావు ? ” మిగిలిన ముగ్గురు ఆసక్తిగా అడిగారు.

“ మా పెళ్లి రోజు నేను ఆ ఆవిడకి ఓ వడ్డాణం కొనిచ్చాను. మా గోల్డెన్ జూబ్లీ ఏనివర్సరీకీ

సరిగ్గా అలాంటిదే చేయించి పెట్టమని అడిగింది. పెళ్ళయి పిల్లలు పుట్టాక దాని నడుం ఎంత

లావైనా సరేనని అదే మోడల్ చేయించి మా ఆవిడకి ప్రెజెంట్ చేస్తున్నాను.” అది విన్న మాజీ

మిత్రుడు మహేశం చెప్పాడు.

“నేను మా ఆవిడని మీ ఇద్దరి కన్నాఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాననుకుంటున్నాను "

“ అలాగా ! ఎలా ? ” అడిగారు రామేశం,

కామేశం వెంటనే “ మా పెళ్లి రోజున నేను నా భార్య కలిసి ,మా స్వంత ఇంట్లోకి గృహప్రవేశం

చేసాం. మా గోల్డెన్ జూబ్లీ రోజున సరిగ్గా అలాంటి ఇంకో ఇల్లు కావాలంది. దాంతో ఓ కొత్త ఇల్లు

కట్టించి ఆ రోజున మేం ఇద్దరం అందులోకి గృహప్రవేశం చేస్తున్నాం " అది విన్న కాసేపు

మౌనంగా వున్న రామేశం కామేశం ఓటమిని అంగీకరిస్తూ, తమ నాలుగో మిత్రుడు

సుబ్బయ్యని అడిగారు.

“ నువ్వేం మాట్లాడవే ? "

“ ప్రతీ భర్త తన భార్యని ప్రేమించడం సహజం. ఇందులో బయటికి చెప్పుకోవడానికే వుంది? ”

ఎదురు ప్రశ్న వేసాడు సుబ్బయ్య.

“ మీ ఆవిడ గోల్డెన్ జూబ్లీకి ఏం కోరనే లేదా ? ” ప్రశ్నించాడు కామేశం.

“ కోరింది "

“ ఆ కోరిక తీరుస్తున్నావా ? ” ఈసారి రామేశం ప్రశ్నించాడు. తలవూపాడు సుబ్బయ్య.

“ ఏమిటా కోరిక ? ” అడిగాడు మహేశం ఆసక్తిగా “ మా హనీమూన్ కి నేను మా ఆవిడ కలిసి

కలకత్తా వెళ్ళాం " ఆలోచనగా ఆగాడతాను.

“ మీ గోల్డెన్ జూబ్లీకి మళ్ళీ కలకత్తా తీసుకెళ్ళమందా " అడిగాడు మహేశం

“ కాదు. ఈ గోల్డెన్ జూబ్లికైనా కలకత్తాకి వచ్చి తనని తిరిగి మా ఇంటికి తీసుకుపోమ్మని

ప్రాధేయ పడుతోంది సరేనన్నాను " చెప్పాడు సుబ్బయ్య.

-రచన :మల్లాది వెంకటకృష్ణమూర్తి.