TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
రాజకీయ నాయకుడు
శాగంటి శ్రీహిత
ఒక రాజకీయ నాయకుడు ఒక స్లమ్ ఏరియాకు వెళ్లాడు.
అక్కడ పేదలందరినీ పలకరిస్తూ పేదరాసి పెద్దమ్మ దగ్గరికి
వచ్చాడు.
ఆ పెద్దమ్మ, తన ఇంటికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి
చూసి చాలా సంతోష పడింది.దాంతో వెంటనే టీ
చేసి...అక్కడే తాగి పెట్టిన ఎంగిలి కప్పులో పోసింది.
అది గమనించిన రాజకీయ నాయకుడికి...కడుపులోని పేగుల్ని దేవేసినట్టు
అయింది.కానీ వాటిని బయట పడనీయకుండా గొంతు దగ్గర అదిమి
పట్టుకున్నాడు.
“ తాగండి బాబుగారు...ఎప్పుడు రాని మీరు మొదటిసారిగా మా ఇంట్లో కాలు
పెట్టారు.టీ తాగండి బాబుగారూ " అంటూ టీ పోసిన ఎంగిలి కప్పుని అందిస్తూ
అతన్ని బలవంతపెట్టింది.
ఆయన చూస్తూ చూస్తూ ఎంగిలి కప్పులో పోసిన టీ తాగలేక, వద్దంటే మిగతా
అందరూ ఏమనుకుంటారో అని కక్కలేక...మింగలేక...కాసేపు ఆలోచించి,
" అందరూ కుడిచేత్తో కప్పు హేండిల్ పట్టుకుని తాగుతారు కదా!పోనీ కనీసం ఎడం
చేత్తో కప్పు హేండిల్ పట్టుకుని తాగితే కొంచెం ఎంగిలైనా తగ్గుతుంది కదా ! "
అనుకుని ఎడం చేత్తో కప్పు హేండిల్ పట్టుకుని టీ తాగాడు.
టీ కప్పు క్రింద పెట్టిన వెంటనే " మీకు కూడా నాలాగే ఎడం చేత్తో కప్పు పట్టుకుని తాగే
అలవాటుందా బాబుగారూ .” అని అడిగింది పేదరాసి పెద్దమ్మ ఆప్యాయంగా.
“ ఆఁ..” అని నోరుతెరిచాడు ఆ రాజకీయ నాయకుడు.
|