NAVVULE-NAVVULU -6

నవ్వులే నవ్వులు - 6

" పాముల ధియేటర్ "

“ ఏమండి...మీ ధియేటర్లో ఎలుకలున్నాయి !” షో

మధ్యలోంచి ఓ ప్రేక్షకుడు వచ్చి కంప్లయిట్

ఇచ్చాడు.

“ ఆ...అందుకే కదా, ఈ రోజు పాముల్ని వదిలిపెట్టా!”

అన్నాడు ధియేటర్ మేనేజర్.

" పూర్తి బట్టల హీరో "

“ ఏమిటోయ్ ముసుగు తన్ని పడుకున్నావు ?” అడిగాడు అజయ్.

“ జ్వరం వచ్చింది " చెప్పింది లత.

“ ఎందుకు వచ్చింది?” అడిగాడు అజయ్.

“ ఇవాళ రోడ్డుమీద ఒక హీరోని చూసాను "

చెప్పింది లత.

“ ఎలాగా చూసావేమిటి ?” ఉత్సాహంగా అడిగాడు అజయ్.

“ పూర్తిగా బట్టలతో " నవ్వుతూ చెప్పింది లత.

" తెలివైన కుక్క "

“ మా కుక్క చాలా తెలివైనది " గొప్పగా చెప్పాడు రామానాధం.

“ ఎలా చెప్పగలవు ?” అడిగాడు గురునాధం.

“ ఎయిడ్స్ వస్తుందని ముందు జాగ్రత్త చర్యగా ఎవరిని కరవదు "

అని చెప్పి పెల్లున నవ్వాడు రామానాధం.

అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు గురునాధం.

“ ఐదొందల కేజీల అమ్మాయి "

“ ఐదొందల కేజీల అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు.అందువల్ల ఏమైనా లాభం కలిగిందా ?”

అడిగాడు రమేష్ జూనియర్ని.

“ ఓ...చలికాలంలో వేడి, ఎండాకాలంలో నీడ దొరుకుతున్నాయి

" చెప్పాడు జూనియర్ డాక్టర్

అయిన కుమార్.

“ శంకుస్థాపన రాయి "

“ మంత్రిగారు రాయి తగిలి ఆసుపత్రిలో చేరారు "

చెప్పాడు అసిస్టెంట్.

“ ఏ రాయేమిటి ?” అడిగాడు ఒక ఎమ్మెల్యే.

“ ఆయన ఎమ్మెల్యేగా వున్నప్పుడు బ్రిడ్జి

తవ్వడానికి సంబంధించిన శంకుస్థాపన రాయి

తగిలి " చెప్పి పగలబడి నవ్వాడు అసిస్టెంట్.

“ ఆఁ..” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు వచ్చిన ఎమ్మెల్యే.