Pun-ditudu shankar Narayana-2

" ' పన్ 'డితుడు శంకర నారాయణ

" పన్ చేయడానికి భాషపై మంచి పట్టు ఉండాలి.మాటను విరిచో,వేరే అర్థంలో ప్రయోగించే చమత్కారాన్ని పన్ డించడం అంత సులభమేమీ కాదు.

శంకరనారాయణ ఈ విధ్యలో సిద్ధహస్తులని ఇప్పటికే ఋజువు చేసుకున్నారు.

తెలుగు,ఇంగ్లీష్ కొండొకచో హిందీ, సంస్కృతం భాషా పరిజ్ఞానాలను కలగలిపి ఎన్నో ప్రయోగాలు చేశారు.

వీరు చేసిన ప్రయోగంలోని వివిధ అధ్యాయాలను పరిశీలించి చూస్తే, పూర్తి ఇంగ్లీష్ మాటనే విరిచి, లేదా వేరే అర్థంలో పుట్టించిన హాస్యం ఏమిటో చూద్దాం.

* కాఫీరైట్ అన్నారు గాని కాపీ రాంగ్ అనలేదు.కాపీ రాంగ్ అనేది డిష్నరీలోను లేదు.కావాలంటే ఏ డిష్నరీ ఐనా వెతుక్కో కాపీ రైట్ అని డిష్నరీలన్నీ ఘోషిస్తున్నాయి.

* చెప్పే పాఠం మీద లెక్చరర్ కె కాన్ సన్ ట్రేషన్ లేకపోతే నాలాంటి కుర్రసన్నాసులకి వుంటుందా ? పాఠం చెబుతున్నంత సేపు ఆయన కాన్ సన్ ట్రేషన్ నా జంతికల మీదే.

* సబెడిటర్ రాసేది ఎడిటోరియల్ ఎలా అవుతుంది ?అందుకే సబెడిటోరియల్ రాసి యిచ్చాను.

* "సినిమాలో అస్సలు బొత్తిగా డ్రామా లేదోయ్ "అన్నాడు సారధి."మీ మాటలకేమైనా అర్థం వుందా ? సినిమా సినిమాలాగా,డ్రామా డ్రామాలాగా వుంటాయి.వుండాలి.అంతేగాని సినిమాలో డ్రామా, డ్రామాలో సినిమా వుంటాయా ఎక్కడైనా ? సినిమాలో సినిమాటిక్ ఎలిమెంట్ వుంటుంది గాని డ్రమటిక్ ఎలిమెంట్ ఎందుకుంటుందోయ్ ?డ్రామా లాగా వుంటే వుందని విమర్శిస్తావు.లేకపోతే లేదని విమర్శిస్తావు " అని వాదించాను.

* “ ఆడవాళ్ళ డ్రస్సుల కటింగ్, స్టైలింగే వేరు.అసలు బటన్సు చూస్తేనే తెలిసిపోతుంది తేడా " అంది వరలక్ష్మి.

* “ బటన్సులో కూడా ఆడామగా అని రెండువెరైటీ లుంటాయా?అన్నీ ప్లాస్టిక్కువే కదా !ఈ బటన్సు ఎప్పుడైనా తెగి పొతే మగ బటన్లు కుట్టితే అని పని చేయవా ?ఆడ బటన్లే కుట్టాలా వాటికి ?ఆడ బటన్లు మగ షర్టులకి పట్టవా ?” అన్నాను.

* ఏదీ స్త్రీత్వమో,ఏది పురుషత్వమో నాకు తెలిసి చావలేదు.ఆడసెంటు మగవాళ్ళు రాసుకుంటే ఆడంగి వాసన కొడతారా ?మగసెంటు ఆడవాళ్ళు రాసుకుంటే మగవాసన కొడతారా ? ఏమిటో ...అంతా విడ్డూరం !ఈ వెధవ ఫాషన్లు.మోజులు అన్నీ అమెరికా వాడే ప్రపంచమంతటికీ నేర్పి పెట్టాడు.

* “ నాలుగు రోజుల నుంచి తిండిలేదు " అన్నాడు ముష్టివాడు."నాలుగు రోజులనుంచి తిండి లేకపోయినా ఇంకా ఎలా లేచి తిరుగుతున్నాయ్యా " అని అడిగాను.

(హాస్యం పత్రిక సౌజన్యంతో )