TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మూడవ భాగం
“ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావోయ్ సుందరం ?” ఫామిలీ డాక్టర్ చేత ప్లాస్టర్స్ వేయించి మళ్ళీ అతన్ని కారులో తీసుకుని వెళ్తున్న చంద్రశేఖరం గారు అడిగారు.
“ నొప్పితో బాధపడుతున్నా " సిన్సియర్ గా చెప్పాడు.
“ అది తెలుస్తోంది.నేనడిగింది...నువ్విప్పుడు జాబ్ ఏం చేస్తున్నావని...?”
“ జాబ్ కోసం...వెతికే జాబ్ చేస్తున్నాను "
“ నీలాటి డైనమిక్ యంగ్ ఫేలోకి ఉజ్జోగం దొరకప్పోవటం ఏమిటోయ్...ఏం చదివావ్...”
“ ఉదయం ఆంజనేయస్వామి దండకం.తరువాత 'హిందూ' పేపరు "
“ అది కాదు...ఎడ్యుకేషన్... ఎడ్యుకేషన్..ఏంటోయ్...”
“ బి.యస్.సి.చదివాను...తెలుగు ఎమ్.ఎ.కూడా చేసాను "
“ వెరీగుడ్...ఓ నెల్లో మా కంపెనీలో ఏదో ఒక జాబ్ వేయిస్తాను.ఈలోగా మా పాప తెలుగులో పూర్.దానికి రోజూ వచ్చి ప్రయివేటు చెబుతూండు...నీకు అవసరమైనంత డబ్బు జీతంగా తీసుకో...” అన్నాడు.
కారుని ఓ పెద్ద బిల్డింగ్ గేటులోంచి లోపలికి పోనిచ్చాడు చంద్రశేఖరం గారు.
సినిమా సెట్ లా వున్న ఆ ఇంటి హాలుని షూటింగ్ చూడ్డానికి మొదటసారి వచ్చిన వాడిలా చూస్తున్నాడు సుందర్రావు. డబ్బుతో ఇల్లు పొగరెక్కినట్టుంది.
కాఫీలు తెచ్చిన నౌకర్ తో " పాపని పిలువ్...” అని చెప్పిన చంద్రశేఖరంగారు వెర్రి చూపులు చూసే సుందర్రావుతో.
“ పాప తప్ప నాకు ఎవరూ లేరయ్యా...దానికి చదువంటే ప్రాణం...చదువు తప్ప వేరేలోకం తెలీదు.తెలుగులో కాస్త వీక్...నువ్వు కాస్త కోచింగ్ ఇచ్చావనుకో...” ఇంకా ఏదో చెబుతున్నాడు.
“ పిలిచారా... డాడీ...” అని పిలించి,తొంభై డిగ్రీల యాంగిల్ లో తల తిప్పాడు సుందర్రావు.
అప్పుడు అక్కడ కనిపించింది అందం.
ఆ అందం...హుందాగా..చీర కట్టుకున్నా సింపుల్ గా వుంది. వినయం విశాలంగా కళ్ళలో పరుచుకుని వుంది.
మర్యాదతో కాస్త ధీమాగానే ,ముందుకు వచ్చిన ముక్కు... నవ్విస్తే నవ్వటానికి రెడీగా వున్నా పెదాలు...ముట్టుకుంటే మాసిపోతాయనిపించే చెంపలు వుండాలి కనక వున్నానన్నట్టు వున్ననడుము...సదరు సరంజామాతో ముందుకు వచ్చే ఆ అందాన్ని చూసి...క్షణం మూర్చ 'పోయి'వచ్చేశాడు సుందర్రావు.
“ అమ్మాయి సంధ్య !పాప అని పిలవటం మాకు అలవాటు "అని సుందర్రావుతో అని కూతురుతో " ఇతను సుందరం అని... బ్యాంక్ దగ్గర డబ్బుకొట్టేసే దొంగని కొట్టి..బాక్స్ ని, నన్ను సేవ్ చేసాడమ్మా...” అన్నాడు ఆయన.
ఎడ్మయిరింగ్ గా సుందరాన్ని చూసింది సంధ్య...సుందరం మొహమాటం నటిస్తున్నాడు.
“ కారు పై నుండి థ్రిల్లింగ్ గా దూకి..ఎగిరి ఎడమ కాలితో దొంగని తన్ని...వాడితో పాటే నెల మీద పడి వాడ్ని కదలకుండా చేసాడు.రియల్లీ గ్రేట్...అన్నట్లు రేపట్నించి ఇతను నీకు ప్రయివేటు చెబుతాడమ్మా...” చెప్పాడు చంద్రశేఖరం.
బెదిరినట్టు చూసి...” ఫైటింగులోనా ?” అని అడిగింది.
సుందరం శుభం సీనులో హీరోలా నవ్వి " కాదండి... తెలుగు " అన్నాడు.
“ బతికించారు " హసిందింది సంధ్య.
“ హు...” అని ప్రాణాలు వదిలినంత పనిచేశాడు సుందరం.
|