TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ అమ్మాయి మురిపెం "
ఎన్.నాగమణి
ఒక అమ్మాయి నదిలో పది మునిగిపోతూ " రక్షించండి... రక్షించండి...” అని అరుస్తూ చేతులను పైకి అటూ ఇటూ ఆడిస్తుంది.
అది చూసిన ఒక వ్యక్తి, పరుగున ఆమె దగ్గరికి వచ్చి...నదిలో నుండి ఆమెను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇలా అడిగాడు.
“ నీ అరుపులు వినబడకపోయినా, పైకెత్తిన నీ చేతులు కనిపించాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు చచ్చిపోయే దానివి.” అన్నాడు.
దానికి అమ్మాయి బిక్కముఖం చేసుకుని అతనిని చూసింది.
“ మొత్తానికి లాస్ట్ మినిట్ లో భలే ఐడియా వచ్చిందమ్మా నీకు ?” అన్నాడు.
“ అయిడియానా పాడా..చేతులకు పెట్టుకున్న గోరింటాకు పాడైపోతుందని ఎత్తనంతే " అంది ఆ అమ్మాయి తన చేతులను చూసుకుని మురిసిపోతూ.
అది చూసిన అతను...ఆశ్చర్యంగా ముఖం పెట్టి " ఇదేమి మురిపెం రా బాబూ !” అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
|